Massive Discount: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై యూజర్లు మండిపడుతున్నారు. వార్నీ..ఫ్లిప్‌కార్టూ.. ఇంత మోసానికి దిగుతావా? అంటూ ఆగ్రహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్లిప్‌కార్ట్ స్కామ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఓ మొబైల్ ఫోన్‌కు 99 శాతం డిస్కౌంట్ ప్రకటించి.. ఆ తర్వాత ఆర్డర్ పెట్టాక.. డెలివరీ దాకా వచ్చాక ఆర్డర్ క్యాన్సిల్ అని వచ్చిందని యూజర్లు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు, కొందరికైతే ఆ మొబైల్ ఫోన్ డెలివరీ చేసినట్టూ చూపిస్తున్నదని, కానీ, వాస్తవంలో తమకు ఫోన్ డెలివరీ కాలేదని, ఫ్లిప్‌కార్ట్ ఇలా మోసం చేయడం ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
ఈ ఏడాది కూడా వార్షిక అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉంటాయని అందరూ ఆశిస్తున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ దానికదిగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదం కారణంగా యూజర్లు చాలా మంది సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
Dear @Flipkart & @motorolaindia 🙌
😬We have very serious concerns about the firedrop 99% discount offer.
It's Look Like Totally Scam with thousands of users😠
👇Look At here, what's concern👇
A few months ago, Flipkart ran an event called Firedrop @0xFireDrops, where users… pic.twitter.com/WmkQOIFBUw
— Vaibhav Gupta (@VaibhavguptaTF) September 17, 2024
Hey @Flipkart @0xFireDrops what tf is this?
Should we file a case against you in consumer court? #flipkartscam pic.twitter.com/jmNmddln22— Aaishah (@wassup_aishah) September 17, 2024
ఫైర్‌డ్రాప్స్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ85 5జీ (128 జీబీ) ఆర్డర్ పెట్టినట్టు యూజర్లు వివరించారు. ఆ ఫైర్ డ్రాప్స్ ఆఫర్ ప్రకారం ప్రాడక్ట్‌పై 99 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఆ మోటో ఫోన్ ఖరీదు రూ. 17,999గా ఉన్నది. ఫైర్ డ్రాప్స్ ఆఫర్ డిస్కౌంట్‌తో దాని విలువ కేవలం రూ. 179కు తగ్గింది. డెలివరీ చార్జితో మొత్తం రూ. 222తో మోటో ఫోన్ చేతికి అందిస్తామని ఉన్నది.
Big Breaking ℹ️
Flipkart first gave offers and then cancelled the orders before the deadline.🥴
This is the wrong behaviour by Flipkart, if it is.
Appropriate action should be taken against him.#flipkartscam #iPhone16Pro pic.twitter.com/Mg8OtLeQGP
— नितेश शुक्ला गर्गवंशम् (@Niteshshukla51) September 18, 2024
చాలా మంది కస్టమర్లు ఈ ఆఫర్‌తో ఎగిరిగంతేసినంత పని చేశారు. వెంటనే ఆర్డర్ పెట్టుకున్నారు. ఆర్డర్ యాక్సెప్ట్ చేసినట్టూ ఫ్లిప్‌కార్ట్ చూపించింది. పిక్ చేసుకున్నట్టు.. డెలివరీకి వస్తున్నట్టూ చూపించింది. డెలివరీ టైమ్‌కు సరిగ్గా.. ఆ ఆర్డర్ క్యాన్సిల్ అని చూపించింది. కొందరికైతే డెలివరీ అయినట్టూ చూపించింది. కానీ, మొబైల్ మాత్రం డెలివరీ కాలేదు. దీనిపై చాలా మంది కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కేర్‌ను సంప్రదించారు. దీనికి సమాధానంగా.. అది టెక్నికల్ ఎర్రర్ అని, టెక్నికల్ గ్లిచ్ అని వచ్చింది. అది అధికారికంగా చేసిన ప్రకటన కాదని వివరించారు. కానీ, ఈ సమాధానంపై కస్టమర్లు సంతృప్తిగా లేరు. ఎందుకంటే.. ఫైర్ డ్రాప్స్ అనేది ఫ్లిప్‌కార్ట్‌కు చెందినదే కదా.. అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.