BigTV English

Fighting In Metro: ఓరయ్యా.. అది మెట్రోరా.. మరీ ఇంత గలీజ్ పనులేంటీ?

Fighting In Metro: ఓరయ్యా.. అది మెట్రోరా.. మరీ ఇంత గలీజ్ పనులేంటీ?

ప్రయాణీకులు సౌకర్యవంతగా జర్నీ చేయాల్సిన మెట్రో రైళ్లు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. దేశంలోని ఇతర నగరాల్లో మెట్రో రైళ్ల పరిస్థితి ఎలా ఉన్నా, ఢిల్లీ మెట్రో నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. సీట్ల కోసం కొట్లాటలు, అసభ్యకర ప్రవర్తన, రెచ్చిపోయి రీల్స్ చేయడం లాంటి ఘటనలతో పలుమార్లు న్యూస్ ఐటమ్ గా మారిపోయింది. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కడింది. ఏకంగా ఇద్దరు ప్యాసింజర్లు దుస్తులు విప్పేసి కొట్లాడుకోవడం, మరికొంత మంది ప్రయాణీకులు స్టేషన్ లో అందరు చూస్తుండగానే ముద్దులు పెట్టుకోవడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం షాకింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మెట్రోనా? WWE రింగా?

ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం కొట్లాడుకోవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఏం జరిగిందో తెలియదు. కానీ, ఇద్దరు ప్రయాణీకులు తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ఒకరికొకరు చొక్కాలు పట్టుకుని కొట్లాడుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి షర్ట్ చినిగిపోయింది. మరో వ్యక్తి తన షర్ట్ విప్పేసి రెజ్లింగ్ లో ప్రత్యర్థిని కొట్లాటకు పిలిచినట్లుగా “రా చూసుకుందాం” అంటూ రంకెలు వేశాడు. అవతలి వ్యక్తిని ఓ యువతి వద్దు అంటూ వారించే ప్రయత్నం చేసింది. కొద్ది సేపు అలాగే కయ్యానికి కాలు దువ్విన తర్వాత యథావిధిగా షర్ట్ వేసుకున్నాడు. ఈ ఘటనను ఓ ప్యాసింజర్ వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం వీడియో నెట్టింట్ తెగ వైరల్ అయ్యింది. ఇక ఓవరాక్షన్ చేసిన ప్రయాణీకుడు 5 అడుగులు ఉండగా, ఎదుటి వ్యక్తి 6 అడుగులు ఉండటం విశేషం. “ఎదుటి వ్యక్తి మెతక మనిషి కావట్టి బతికిపోయాడు. లేదంటే వీడి ఎముకలు విరిగేవి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Read Also: మెట్రోలో మద్యం తాగిన యువకుడు..నెట్టింట వీడియో వైరల్!

మెట్రో స్టేషన్ లో ముద్దు ముచ్చట!

ఇక మరికొంత మంది ప్రయాణీకులు ఏకంగా మెట్రో స్టేషన్ లోనే అసభ్యకర పనులు చేస్తూ కెమెరాలకు చిక్కుతున్నారు. రీసెంట్ గా ఢిల్లీ మెట్రోలో ఒకరికొకరు దగ్గరగా కూర్చొని రొమాన్స్ చేస్తూ కనిపించారు. చుట్టు పక్కల ఉన్న వాళ్లు చూస్తున్నారని తెలిసినా, కొంత మంది వారిని వీడియో తీస్తున్నట్లు గమనించినా, సదరు జంట ముద్దులు పెట్టకునేందుకు ప్రయత్నించారు. ఆ అమ్మాయి యువకుడిని ఎక్కడెక్కడో తడుముతూ కనిపించింది.  కాసేపటికి ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ వీడియో అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా ఏకంగా మెట్రో స్టేషన్ లో యువ జంటలు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయి కనిపించారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందనే సోయి లేకుండా లిప్ లాక్ చేసుకున్నారు. రెండు జంటలు నానా హంగామా చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  మొత్తంగా ఢిల్లీ మెట్రో నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రచ్చకు కారణం అవుతుంది.

https://www.instagram.com/epic_zindgi/reel/DIdmIMCxL5j/

Read Also: మెట్రోలో అందరూ చూస్తుండగానే ఆ పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబూ?

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×