Big Stories

Dogs Names Printed on Wedding Card: పెళ్లి పత్రికలో భౌ భౌ.. ఆశ్చర్యపోయిన చుట్టాలు

Dogs Names Printed on Wedding Card: శునకాలకు సాయం చేస్తే అవి ఎన్ని రోజులైనా మనల్ని మరిచిపోవు అని అంటుంటారు. అంతేకాదు.. శునకాలు ఎప్పటికీ విశ్వాసంగా ఉంటాయి.. అందుకే అవి చేసిన సాయాన్ని మరిచిపోవని అంటుంటారు. అయితే, ఓ జంతు ప్రేమికుడికి శునకాలంటే చాలా ఇష్టం. తన ప్రేమను వినూత్న రీతిలో చూపించాడు. అది చూసిన చుట్టాలు.. ముందు ఆశ్యర్యపోయారు.. ఆ తర్వాత నువ్వు సూపర్ అంటూ అతడిని అభినందించారు. ఈ విషయం నెట్టింటా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చుట్టాలే కాదు నెటిజన్స్ కూడా వాహ్ అంటూ నీది సూపర్ డెసిషన్ అంటున్నారు.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని రాణిపురకు చెందిన యశ్వంత్ అనే యువకుడు శునకాలపై వినూత్న రీతిలో తన ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికలో శునకాల పేర్లను ముద్రించాడు. అలా ముద్రించిన తన వివాహ పత్రికలను బంధువులకు, తెలిసినవారికి ఇస్తున్నప్పుడు వారు ముందుగా ఆశ్చర్యపోయారు. అయితే, ఆ తరువాత అతనికి శునకాలపై ఉన్న ప్రేమను తెలుసుకుని అభినందించారు. అయితే, అతడి వివాహం ఏప్రిల్ 21న జరిగింది. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో భౌ భౌ పార్టీ అంటూ పేర్కొంటూ.. తాను ఇష్టంగా పెంచుకుంటున్న శునకాలు.. కాలు, లాలూ, రాకీ, జోజో పేర్లను ముద్రించాడు. అంతేకాదు.. పెళ్లి ఊరేగింపు వంటి ఇతర కార్యక్రమాల్లో కూడా శునకాలను భాగం చేసి తన ప్రేమను చాటుకున్నాడు.

- Advertisement -

అయితే, యశ్వంత్ ఐదేళ్ల క్రితం అటుగా వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఓ కుక్క పిల్ల టైర్ కిందకు వచ్చింది. వెంటనే అతను అలర్ట్ అయ్యి స్కూటర్ ఆపాడు. ఆ తరువాత దాని చూశాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ కుక్క పిల్లకు ఏం కాలేదు. ఆ వెంటనే ఆ కుక్క పిల్లను తన ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. అప్పటి నుంచి అతనికి శునకాలపై మరింత ఇష్టం ఏర్పడింది. దీంతో అతను మరో 3 శునకాలను ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. అలా అతను మొత్తం 4 శునకాలను పెంచుకుంటున్నాడు.

Also Read: ‘నేను జర్మనీ నుంచి వచ్చి ఓటు వేశా’

శునకాలపై తనకున్న ప్రేమను పై విధంగా చూపించడంతో చుట్టాలు, జంతు ప్రేమికులు అతడిని అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి యశ్వంత్ ను ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News