BigTV English
Advertisement

Ambati comments: అంబటి మాట.. వైసీపీ రాచరికం.. అందుకే..

Ambati comments:  అంబటి మాట.. వైసీపీ రాచరికం.. అందుకే..

Ambati comments: జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ అంబటిరాయుడు. ఆ పార్టీ పాలన రాచరికం, ఆధిపత్య ధోరణిలో సాగుతుందన్నాడు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సైతం సీఎం జగన్‌ను కలిసే ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టేశారు. అసలేం జరిగింది. అంబటి ఈ స్థాయిలో విరుచుకు పడడానికి కారణమేంటి?


క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన తర్వాత అంబటిరాయుడు తొలిసారి సీఎం జగన్ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సెకండరీ. క్రికెట్ గురించి ప్రస్తావించడం, చెన్నై తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఓ క్రికెట్ టీమ్ ఉండాలని అప్పట్లో సీఎం జగన్.. రాయుడుతో చెప్పుకొచ్చారు. మరోసారి సీఎం జగన్‌ను అంబటి రాయుడు కలిశాడు. ఈసారి పార్టీ కండువా కప్పేసుకున్నాడు. ఏం జరుగుతుందో అంబటిరాయుడుకి అస్సలు తెలియరాలేదు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తిరగడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

గుంటూరు నుంచి అంబటిరాయుడు పోటీ చేస్తున్నారన్నది అందులోని సారాంశం. కొద్దిరోజులు పాటు వైసీపీ వ్యవహారశైలిని దగ్గరుండి గమనించాడు రాయుడు. ఈ పార్టీలో మనం కష్టమనే అభిప్రాయానికి వచ్చేశాడు. నేరుగా పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం, జనసేన తీర్థం పుచ్చుకోవడం వెనువెంటనే జరిగిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ గురించి అసలు విషయాలు బయటపెట్టడం మొదలుపెట్టాడు.


ALSO READ: ఏమీ లేకుండానే పవన్ సాయం, అదే చట్ట సభలకు వెళ్తే..

గతంలో వైసీపీ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ వాతావరణం గమనించానని, ప్రజా సేవకు ఈ పార్టీ వేదిక కాదని తనకు అర్థమైందన్నాడు అంబటిరాయుడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చినట్టు మనసులోని మాట బయటపెట్టాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని నందివెలుగులో శనివారం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరపున ఆయన ప్రచారం చేశాడు. రాష్ట్ర ప్రగతికి, యువతకు ఉపాధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక్కానించాడు. ప్రతీ ఓటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని అంబటిరాయుడు బయటపెట్టాడు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×