BigTV English

Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్ కు బిగ్ షాక్… బుమ్రా ఇక రావడం కష్టమే ?

Jasprit Bumrah:  ముంబై ఫ్యాన్స్ కు బిగ్ షాక్… బుమ్రా ఇక రావడం కష్టమే ?

Jasprit Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… అందరి కన్ను ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) పైనే ఉంది. 2025 టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )… ప్రస్తుతం బెంగళూరులోని రిహాబిలిటేషన్ సెంటర్ లో ( Rehabilitation Center in Bangalore ) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2024 డిసెంబర్ మాసంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దెబ్బకు టోర్నమెంట్ నుంచి కూడా తప్పుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు జస్ప్రీత్ బుమ్రా.


Also Read : Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ… ముంబైని నిండా ముంచేలా ఉన్నాడే..?

అటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )  కోసం జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయినప్పటికీ కూడా జస్ప్రీత్ బుమ్రా ఆడేందుకు ఛాన్స్ రాలేదు. అతని గాయం తీవ్ర తరం కావడంతో… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగి తన పని సక్రమంగా చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా… ఈ టోర్నమెంట్ కు కూడా ఆడడం లేదు. త్వరలోనే జట్టులో కలుస్తాడని చెబుతున్నారు. అయితే తాజాగా జస్ప్రీత్ బుమ్రా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read : Venkatesh Iyer: 300 లేదు బొక్క లేదు… SRH పరువు తీసిన వెంకటేష్ అయ్యర్ ?

ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Mumbai Indians vs Lucknow Super Giants ) జట్ల మధ్య కీలక మ్యాచ్.. జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్కు కూడా జస్ప్రీత్ బుమ్రా మిస్ అవుతాడని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ముంబై ఇండియన్స్. ఇవాళ ఒక్క మ్యాచే కాకుండా సోమవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ( Royal Challengers Bangalore team )… ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) బిగ్ ఫైట్ ఉంది. ఈ మ్యాచ్ కి కూడా జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతాడని చెబుతున్నారు. అయితే ఈ రెండు మ్యాచ్లు పూర్తయిన తర్వాత ముంబై జట్టులోకి అడుగుపెడతాడట జస్ప్రీత్ బుమ్రా. రెండు మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఏ మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు అనే దాని పైన ప్రకటన చేయబోతున్నారట. ఇది ఇలా ఉండగా… ఇవాళ లక్నోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ లో ఉచితంగా ఈ మ్యాచ్ తిలకించవచ్చు.

Related News

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Big Stories

×