Programming Cheerleaders: తమ ఉద్యోగులను ఉత్సాహంగా ఉంచిలా, పనిలో క్వాలిటీ పెరిగేలా తగిన వాతావరణం క్రియేట్ చేసేలా పలు కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేసేలా తగిన చర్యలు తీసుకుంటాయి. తాజాగా ఓ చైనీస్ టెక్ కంపెనీ కూడా తమ ఉద్యోగులను ఆహ్లాదకరంగా పని చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రోగ్రామర్లు యాక్టివ్ గా వర్క్ చేసేందుకు చీర్ లీడర్లను ఏర్పాటు చేసింది. వీళ్లు సదరు కంపెనీ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తుంటారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
చీర్ లీడర్స్ ఏం చేస్తారంటే?
నిజానికి కోడింగ్ అనేది చాలా కష్టమైన పని. ఈ పనిని తమ ప్రోగ్రామర్లు ఉత్సాహకరంగా చేసేందుకు పర్సనల్ చీర్ లీడర్స్ ను ఏర్పాటు చేసింది చైనా టెక్ కంపెనీ. ఈ చీర్ లీడర్స్ ప్రోగ్రామర్లను ఇబ్బంది కలగకుండా వారి ఫుడ్ ఆర్డర్లను తీసుకోవడానికి, ఆహ్లాదకరమైన వర్క్ అట్మాస్పియర్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ప్రోగ్రామింగ్ చీర్లీడర్లు’ అని పిలువబడే ఈ యువతులు తమ పాత్రలో భాగంగా ఉద్యోగులతో చిట్ చాట్ చేస్తారు. పింగ్ పాంగ్ ప్లే చేస్తారు. ఆఫీసులో గిటార్ ఉద్యోగులు గిటార్ వాయిస్తే, ఈ చీర్ లీడర్స్ నవ్వుతూ, చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తారు.
చీర్ లీడర్స్ ఏర్పాటుతో పెరిగిన ప్రొడక్టివిటీ
చీర్ లీడర్స్ నియామకం తర్వాత ప్రోగ్రామర్ల ఉద్యోగ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని చైనా టెక్ కంపెనీ HR మేనేజర్ వెల్లడించాడు. తమ కంపెనీ ప్రోగ్రామర్లు ఉత్సాహపరచడం ద్వారా మంచి క్వాలిటీ ప్రొడక్టివిటీ పెరిగిందన్నారు. ఉద్యోగులు ఎంత ప్రశాంతమైన, ఉత్సాకరమైన వాతావరణంలో పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని తాము గుర్తించినట్లు సదరు మేనేజర్ తెలిపారు.
Read Also: స్వయం తృప్తి కోసం అరగంట బ్రేక్.. ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్!
చీర్ లీడర్స్ నియామకంపై విమర్శలు
అటు కొంత మంది చీర్ లీడర్స్ నియామకంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ చర్యను అవమానకరమైన అంశంగా పరిగణిస్తున్నారు. అంతేకాదు, లింగ వివక్షకు ఇదో ఉదాహారణ అంటూ గోల చేస్తున్నారు. కొంత మంది ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, మరికొంత మంది మహిళా ప్రోగ్రామర్లను నియమించుకోవడం బెస్ట్ అంటున్నారు. అయితే, సదరు చైనా టెక్ కంపెనీ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. తాము సదరు చీర్ లీడర్స్ ను ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి విమర్శలను లైట్ తీసుకుంటామని తేల్చేసింది.
Read Also: నీతా అంబానీ A2 పాలే తాగుతుందా? వాటి ప్రత్యేకత తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!