Viral Kiss: 2026 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఒకవైపు మైదానంలో యుద్దాన్ని తలపిస్తుంటే, మైదానం వెలుపల మాత్రం కొన్ని ఊహించని సంఘటనలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మెక్సికోలోని గ్వాడలహారా వేదికగా సౌత్ కొరియా, చెకియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు జరిగిన ఒక విచిత్రమైన ఘటనే దీనికి కారణం. కొరియన్ టెలివిజన్ రిపోర్టర్ ఒకరు లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో ఉండగా, మెక్సికన్ యువతి చేసిన ఒక క్రేజీ పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ రిపోర్టర్ లైవ్ కెమెరా ముందు మ్యాచ్ అప్‌డేట్స్ ఇస్తుండగా, ఒక్కసారిగా ఫ్రేమ్‌లోకి దూసుకొచ్చిన ఒక స్థానిక మహిళ అతని చేతిని పట్టుకుని, గట్టిగా హగ్ చేసుకుని, బుగ్గపై ముద్దు పెట్టింది.
లైవ్ రిపోర్టింగ్ సమయంలో ఇలాంటి పరిణామం ఊహించని ఆ జర్నలిస్ట్ ఒక్కక్షణం షాక్‌కు గురయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా, ఆమె వెళ్ళిపోయాక వెంటనే తేరుకుని చాలా హుందాగా నవ్వుతూ స్పందించాడు. ఎలాంటి కోపం ప్రదర్శించకుండా “గ్రేసియాస్” (థాంక్యూ) అంటూ చాలా స్పోర్టివ్‌గా సమాధానం ఇచ్చి తన లైవ్ బ్రాడ్‌కాస్ట్‌ను కంటిన్యూ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది.
also read :రీల్స్ పిచ్చి కొంపముంచింది.. పక్కా ప్లాన్‌తో 10 లక్షలు లేపేసిన దొంగలు!
ఫుట్‌బాల్ పండుగలో ఉండే అసలైన మజా, ఆనందం ఇదేనంటూ కొందరు నెటిజన్లు దీనిపై చాలా సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచకప్ అనేది దేశాల మధ్య వైరాన్ని పక్కనబెట్టి ప్రేమాభిమానాలను పంచుకునే వేదిక అని, ఇందులో ఎలాంటి తప్పు లేదని వారు వాదిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మొఖాల్లోనూ నవ్వులే ఉన్నాయి తప్ప, అక్కడ ఎలాంటి భయం గానీ, దురుద్దేశం గానీ లేవని కొందరు సమర్థిస్తున్నారు.
కానీ, దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చే మొదలైంది. ఒకవేళ ఇక్కడ జెండర్ రివర్స్ అయి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒక పురుష అభిమాని ఇలాగే లైవ్ లో ఉన్న మహిళా రిపోర్టర్‌ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఉంటే, ప్రపంచం మొత్తం దానిని వేధింపులుగా (హరాస్‌మెంట్‌గా) ముద్ర వేసేది కదా అని నిలదీస్తున్నారు. వ్యక్తిగత హద్దులు, సమ్మతి (కన్సెంట్) అనేవి కేవలం మహిళలకేనా, పురుషులకు వర్తించవా అనే సరికొత్త కోణాన్ని నెటిజన్లు తెరపైకి తెచ్చారు. ఏదేమైనా, ఈ వైరల్ డ్రామా ఒకవైపు నడుస్తుంటే, మైదానంలో మాత్రం సౌత్ కొరియా జట్టు కెప్టెన్ సన్ హ్యూంగ్-మిన్ సారథ్యంలో చెకియాపై ఘన విజయం సాధించి టోర్నమెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అటు ఆటలోనూ, ఇటు సోషల్ మీడియా వైరల్ ట్రెండ్స్‌లోనూ ప్రస్తుతం సౌత్ కొరియానే హాట్ టాపిక్‌గా నిలిచింది.
also read :ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?