BigTV English

Man With 3 Legs: మూడు కాళ్ల సుందరాంగుడు.. 16 వేళ్లు.. 2 జననాంగాలు.. ఇతడిది ఓ అరుదైన జన్మ!

Man With 3 Legs: మూడు కాళ్ల సుందరాంగుడు.. 16 వేళ్లు.. 2 జననాంగాలు.. ఇతడిది ఓ అరుదైన జన్మ!
Advertisement

BIG TV LIVE Originals: శరీర భాగాలు అతుక్కుని జన్మించిన వారిని తరచుగా చూస్తూనే ఉంటారు. తెలుగు నేలపైనా వీణా-వాణి సిస్టర్స్ ఇలాగే జన్మించారు. శరీరాన్ని పంచుకుని పుట్టిన వారే కాదు, వింతైన శరీర అవయవాలతో పుట్టిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఫ్రాంక్ లెంటిని. అతడు మే 18, 1889లో ఇటలీలోని రోసోలినిలో జన్మించారు. పుట్టినప్పటి నుంచే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. మూడు కాళ్లు, 16 వేళ్లతో జన్మించాడు. అంతేకాదు, రెండు జననాంగాలను కలిగి ఉన్నాడు. ఎన్నో అరుదైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాడు.


 ఇటలీ నుంచి అమెరికాలకు వెళ్లిన లెంటిని!

లెంటినిని చిన్నప్పటి నుంచి అందరూ వింతగా చూసేవారు. ఈ నేపథ్యంలో 8 ఏళ్ల వయసులో అతడిని అమెరికాలోని తన బంధువుల ఇంటికి పంపించారు కుటుంబ సభ్యులు. ఆ నిర్ణయమే అతడి జీవితంలో కీలక మలుపు తిప్పింది.  తన మూడు కాళ్లతో నడవడం, పరిగెత్తడం, గేమ్స్ ఆడటం నేర్చుకున్నాడు. అతడి మూడవ కాలు పొట్టిగా ఉన్నప్పటికీ, అతడికి సపోర్టు చేసేది. అదే కాలు తర్వాత తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసింది.


సర్కస్ కెరీర్ ను ఎంచుకున్న లెంటిని

టీనేజ్ లోనే లెంటిని వినోద ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నాడు. 20వ శతాబ్దపు ప్రారంభంలో సర్కస్‌ లు , సైడ్‌ షోలో పాల్గొన్నాడు. అమెరికాలో రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్, ఇతర ప్రసిద్ధ సర్కస్ బృందాలతో పనిచేశాడు. అతను తన మూడవ కాలును ఉపయోగించి ఫుట్‌ బాల్ ఆడటం, జంప్ చేయడం, తర అద్భుతమైన చర్యలను ప్రదర్శించేవాడు. అతని హాస్య భావం, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. సర్కస్ స్టేజిల మీదే తన జీవిత కథలను చెప్పేవాడు. తన పరిస్థితి గురించి ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పేవాడు. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఈ సామర్థ్యం అతన్ని సైడ్‌ షో ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపు తీసుకొచ్చింది.

లెంటిని వైవాహిక జీవితం..             

లెంటిని తన వ్యక్తిగత జీవితంలో ప్రేమలో పడ్డాడు. థెరిసా ముర్రేను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు అయ్యారు.  జోసెఫిన్, నటాలియా, ఫ్రాంక్ జూనియర్, జేమ్స్. అతని కుటుంబ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు.  లెంటిని 20వ శతాబ్దం వరకు మంచి ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. 1950లలో సర్కస్ నుండి పదవీ విరమణ చేసి ఫ్లోరిడాలో స్థిరపడ్డాడు. 1966లో 77 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించడు. అతడి జీవితం సర్కస్ వినోద చరిత్రపై చెరగని ముద్ర వేసింది. వైకల్యాన్ని కూడా విజయం కోసం ఉపయోగించిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా, చాలా మంది పనీ పాటా లేకుండా తిరిగే వారికి లెంటిని ఓ అద్భుతమైన ఉదాహారణగా చెప్పుకోవచ్చు. అవిటి తనాన్ని చూసుకుని బాధపడే వారికంటే.. వైకల్యాన్నే విజయానికి మెట్లుగా ఉపయోగించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచాడు.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: ఆ గ్రామంలో కాలనీలన్నీ గుండ్రంగా ఉంటాయి.. మీరూ అక్కడ స్టే చేయొచ్చు!

Related News

Sadar Festival: సదర్ దున్నపోతుకు కాస్ట్లీ మద్యం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Foreign Tourist Trolled: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

Non-venomous Snake: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Big Stories

×