డెన్మార్క్‌లోని ‘బై గార్డెన్ సిటీ’ అనేది కోపెన్ హెగెన్ కు సమీపంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాలనీల సముదాయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. వాటిలో కొన్నింటి గుర్తించి ఇప్పుడు తెలసుకుందాం..
⦿ సర్కిలర్ డిజైన్: 1964లో ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ ఎరిక్ మైగిండ్ ఈ సిటీకి రూపకల్పన చేశాడు. మొత్తంగా 24 సర్కిల్స్ తో కూడిన సిటీని రూపొందించాడు. ప్రతి సర్కిల్ లో 12 ఇళ్లు, 284 గార్డెన్ ప్లాట్ లు ఉన్నాయి. ఈ వృత్తాకార నగర నిర్మాణం 18వ శతాబ్దపు డెనిష్ గ్రామాలకు ప్రతిబింబంగా ఉండేలా రూపొందించబడింది. ఈ విధానం సామాజిక సంబంధాలను మరింత మెరుగు పరిచేలా ఏర్పాటు సృష్టించబడింది.
⦿ సామాజిక చర్యలు: ఈ వృత్తాకార కాలనీలో మధ్య భాగాన్ని సమాజంలోని వ్యక్తులు కలిసిపోవడానికి, మాట్లాడ్డానికి ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా రూపొందించబడింది. ఇది డెన్మార్క్ హైగ్లీ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ విధాన్ని చిన్న సమూహాల్లో సంతోషాన్ని నింపుతుంది.
⦿ గార్డెన్ కల్చర్: ఇక ఈ ఇండ్ల మధ్య విశాలమైన స్థలం ఉంటుంది. ఇందులో తోటలను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్లు అద్దెకు ఇస్తారు. ఇది నగరంలోని అపార్ట్ మెంట్ లలో ఉండే వారికి సహజ వాతావరణంలో, పూలు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు పెంచుకునే అవకాశం కల్పిస్తుంది.
⦿ ఏడాదిలో 6 నెలలే నివాసం: స్థానిక చట్టాల ప్రకారం, గార్డెన్ సిటీలోని ఇళ్లలో సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే నివాసం ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ఇక్కడ నివాసం ఉండవచ్చు. వారాంతాల్లో మాత్రమే నివసించేలా నిబంధనలు రూపొందించారు. ఇక్కడ నివాసం నివాసం ఉండే వారి సొంత ఇళ్లు 20 కిలోమీటర్ల లోపు ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. ఇది ఒక రిట్రీట్‌గా ప్రాంతంగా గుర్తించారు. పూర్తి సమయ నివాసంగా ఉండదు.
⦿ పర్యావరణ అనుకూలంగా: ఇక్కడి ఇండ్లు సోలార్ హీటింగ్, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ లాంటి సౌకర్యాలతో అమర్చబడి ఉంటాయి. ఈ పద్దతులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పాదచిత్రాన్ని తగ్గిస్తుంది.
Read Also: ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!
⦿ సాంస్కృతిక ఆకర్షణ: ఈ సిటీ ఏరియల్ వ్యూలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. డ్రోన్ ఫోటోలో ఒక యుటోపియన్, సై-ఫై సిటీలా కనిపిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది.
మొత్తంగా బ్రాండ్ బీ గార్డెన్ సిటీ డెన్మార్క్ లో నగర జీవన శైలిని సహజ వాతావరణంతో కలిపే ఒక నమూనాగా గుర్తింపు తెచ్చుకుంది. దీని నిర్మాణం సామాజిక సంబంధాల ప్రోత్సాహన, సుస్థిరత లాంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. సందర్శకులు ఈ ప్రాంతాన్ని చూసి ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది అక్కడ ప్రభుత్వం.
Read Also: ఈ 58 దేశాలకు వీసా అక్కర్లేదు.. పాస్ పోర్ట్ ఉంటే చాలు, వెంటనే ప్లాన్ చేసుకోండి!