Viral Video : కాలం మారింది. జనరేషన్ ఛేంజ్ అయింది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేదిప్పుడు. అందరూ సమానమే. అన్నిట్లోనూ ఈక్వలే. చదువులైనా, ఆటపాటలైనా. ఎందులోనూ తగ్గేదేలే అంటున్నారు. అమ్మాయిలు మరీ ఫస్ట్ ఉన్నారు. గతంలో టిక్‌టాక్‌లతో దుమ్ములేపారు. అది బ్యాన్ అయ్యాక ఇన్‌స్టాపై పడ్డారు. రీల్స్, షార్ట్స్ కోసం వెరైటీ వెరైటీ ఫీట్స్ చేస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. లైక్‌లు, కామెంట్స్‌తో ఫుల్ పాపులర్ అవడం. ఇదే మెయిన్ టార్గెట్‌గా దూసుకుపోతున్నారు. ఆ రీల్స్ పిచ్చిలో కొన్ని రిస్కీ పనులు కూడా చేయడం అప్పుడప్పుడు ప్రమాదాలకు కారణం అవుతోంది. లేటెస్ట్‌గా ఓ అమ్మాయి తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌ను ప్రదర్శించింది. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ హీరోలేనా.. నేను సైతం..
ఫిట్‌నెస్, ఎక్సర్‌సైజ్, జిమ్నాస్టిక్, కరాటే, జూడో.. వీటన్నిటిలోనూ కొన్ని ఫీట్లు కామన్‌గా ఉంటాయి. అందులో ఒకటి బ్యాక్‌ఫ్లిప్. ఇది అత్యంత కష్టమైనది. నిలుచున్నచోటే వెనక్కి ఎగరడం. ఎంత ప్రావీణ్యం, ప్రాక్టీస్ ఉంటేకానీ చేయలేరు. అది చేశారంటే వాళ్లిక ఎక్స్‌పర్ట్స్ కిందే లెక్క. బాలీవుడ్ కండల వీరులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లాంటి వాళ్లు బ్యాక్‌ఫ్లిప్స్ చేయడంలో తోపులు. హీరోలేనా.. నేను కూడా అలా చేస్తానంటూ ఓ అమ్మాయి ముందుకొచ్చింది. బ్యాక్ ఫ్లిప్స్‌తో అదరగొట్టింది. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతోంది.
వర్షం నీటి గుంతలో..
హీరోల్లాగా డ్యాన్స్‌ఫ్లోర్ మీద, మెత్తటి యోగా మ్యాట్స్ మీద, గ్రిప్పింగ్ షూస్ గట్రా వేసుకుని బ్యాక్ ఫ్లిప్స్ వేయలేదు ఆ అమ్మాయి. కాళ్లకు షూస్ లేవు. ఉత్తి కాళ్లతోనే వేసేసింది. నున్నటి ఫ్లోర్ లేదు. అలాగని మెత్తటి మట్టి కూడా కాదు. వర్షపు నీరు నిలిచిన గ్రౌండ్‌లో అత్యంత కష్టమైన బ్యాక్‌ఫ్లిప్స్ వేసి ఔరా అనిపించింది ఆ చిన్నారి. ఒక్కటి వేయడమే చాలా కష్టం. అలాంటిది గ్యాప్ లేకుండా వరుసగా ఆరు బ్యాక్ ఫ్లిప్స్ ఈజీగా వేసేసింది. నీళ్లలో, బురదలో కాళ్లు జారకుండా, గ్రిప్ మిస్ అవకుండా ఆ అమ్మాయి చేసిన ఫీట్‌కు సోషల్ మీడియా కేరింతలు కొడుతోంది. శెభాష్ గర్ల్ అంటూ చాలామంది నెటిజన్లు ప్రశంసలతో ఎంకరేజ్ చేస్తున్నారు. కాస్త జాగ్రత్త, ఇలాంటి రిస్కీ జంప్స్ అవసరమా అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.