RCB Criticised: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinna swamy ) వేదికగా జరిగిన తొక్కిసలాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ సంఘటన నేపథ్యంలో… దాదాపు 11 మంది రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు మృతి చెందారు. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ నెగ్గడం తో… చిన్న స్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ విజయోత్సవ ర్యాలీకి… తక్కువ స్థాయిలో జనాలు వస్తారని అనుకుంటే… 3 లక్షలకు పైగా మంది వచ్చారు. దీంతో అక్కడ భద్రత సిబ్బంది చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు.
11 మంది మరణించినా.. ఆగని సన్మానాలు
చిన్న స్వామి స్టేడియం వేదికగా సరిగ్గా బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు.. తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కి సలాట నేపథ్యంలో 11 మంది మరణించగా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో చిన్న స్వామీ స్టేడియం లోపల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులందరూ ఉన్నారు. ఇక్కడ మారణకాండ జరుగుతున్నప్పటికీ… లోపల మాత్రం విరాట్ కోహ్లీ అలాగే ఇతర ప్లేయర్ లందరికీ సన్మానం చేస్తూనే ఉన్నారు. దాదాపు సాయంత్రం 6:30 వరకు చిన్న స్వామి స్టేడియం లోపల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వాళ్ల కోసం వచ్చిన అభిమానులను పట్టించుకోకుండా.. భార్యలతో… బెంగళూరు క్రికెటర్లు ( Rcb Team)ఎంజాయ్ చేశారు.
ఫ్యాన్సును చూస్తూ ఫ్లయింగ్ కిస్ లు కూడా ఇచ్చారు. ముఖ్యంగా అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా.. 11 మంది చనిపోతే పట్టించుకోకుండా… గ్రౌండ్లో సెల్ఫీలు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 11 శవాలు బయట ఉన్నా కూడా.. క్రికెటర్లకు సన్మానం చేయడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు సామాన్య ప్రజలు.
RCB జట్టుపై బ్యాన్?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సెలబ్రేషన్స్ సందర్భంగా 11 మంది మృతి చెందారని… దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకే ఒక టైటిల్ కోసం 11 మందిని చంపేశారని… ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. 11 మంది కుటుంబాలకు… న్యాయం జరగాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నారు. రక్తపాతం ఒకవైపు జరుగుతుంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారా..? అసలు మీరు మనుషులేనా..? ఇంత దిగజారుతారా అంటూ విరాట్ కోహ్లీపై అలాగే బెంగళూరు క్రికెటర్ల పై ఫైర్ అవుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి డికె శివ కుమార్ ను అరెస్టు చేయాలని అంటున్నారు.
Also Read: Stampede at RCB Parade: RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..7 మంది ఫ్యాన్స్ మృతి, 20 మందికి గాయాలు
BLACK DAY IN CRICKET HISTORY @RCBTweets @imVkohli 🙏 pic.twitter.com/uhQqbm6CRR
— CSK Fans Army™ (@CSKFansArmy) June 4, 2025