Earthquake surgery: ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టిన భారీ భూకంపం, సునామీ నేపథ్యంలో.. ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. జపాన్ తీరాన్ని, పసిఫిక్ ప్రాంతాన్ని వణికించిన ఈ ప్రకృతి విపత్తు 8.8 తీవ్రతతో నమోదవ్వడం ప్రపంచానికి ఝలక్ ఇచ్చింది. ఈ ప్రకంపనల ప్రభావం రష్యా తూర్పు తీరాన్ని కూడా తాకగా, అక్కడి కమ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అద్భుత ఘటన ఇప్పుడు అందరి హృదయాల్ని తాకుతోంది.
ఆపరేషన్ లో ఉన్న సమయంలో భూమి కంపించిందే!
యధావిధిగా వైద్యులు, ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా భూమి కంపించసాగింది. అక్కడే ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో నమోదైన దృశ్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిగణనకు వస్తోంది. భూమి కంపిస్తూ శబ్దాలు వినిపిస్తుంటే, మెజారిటీ మంది కచ్చితంగా అక్కడి నుంచి బయటకు పరుగెత్తిపోతారు. కానీ ఈ వీడియోలో కనిపించిన వైద్య బృందం మాత్రం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు.
తమ కర్తవ్యాన్ని మరువని వైద్య బృందం
భూకంప తీవ్రత పెరుగుతున్నప్పటికీ, ఆ వైద్యులు మొదటగా చేసిన పని.. రోగిని కాపాడటం. ఆపరేషన్ చేస్తున్న పేషెంట్‌కి ఎలాంటి నష్టం జరగకూడదన్న బాధ్యతతో వారు శస్త్రచికిత్సను కొనసాగించారు. మెజారిటీ వైద్యులు పేషెంట్‌ను బలంగా పట్టుకున్నారు, ఇంకొంతమంది పరికరాలు కదలకుండా చూసుకున్నారు. ఈ మధ్యంతర సమయంలో వైద్యుల ముఖాలపై ఉన్న తీవ్రత, వారి ధైర్యాన్ని తెలియజేస్తోంది.
అభినందనల వెల్లువ
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు వారి ధైర్యాన్ని కొనియాడుతున్నారు. భూకంపం వచ్చినా, శస్త్రచికిత్స ఆపకుండా కొనసాగించగలిగిన వారు నిజమైన హీరోలు అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కొని పనిని కొనసాగించటం అంటే, అది సగటు మనిషి పనికాదు. వారు పతకాలు పొందాలని అభిప్రాయపడ్డారు.
Also Read: July 2025 tsunami prediction: సునామీ వచ్చింది.. ఆమె చెప్పినట్లే జరిగింది, కానీ…
రష్యా ఆరోగ్య శాఖ మంత్రి ఒలెగ్ మెల్నికోవ్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా స్పందిస్తూ, పెట్రోపావ్‌లోవ్స్క్-కమ్చాట్స్కీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తుండగా భూకంపం సంభవించింది. అయినా అక్కడి వైద్యులు శాంతంగా వ్యవహరించి, ఆపరేషన్‌ను నిలిపివేయకుండా ముగించారు. ఇది మన ఆరోగ్య రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో ఎంతో మందిలో భయం మొదలవుతుంది. కానీ వీరు చూపించిన శాంతత, కట్టుదిట్టైన ధైర్యం మనం నేర్చుకోవలసిన పాఠం. సహజ విపత్తులు ఎలా వచ్చినా, మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అనే బోధన ఇది. శస్త్రచికిత్సలో ఉన్న రోగిని కాపాడేందుకు, వారి ప్రాణాలను పణంగా పెట్టిన ఈ వైద్య బృందం మానవతా విలువలకు ప్రతిరూపం.
వీడియోను చూసినవారు భావోద్వేగానికి లోనవుతున్నారు
సోషల్ మీడియాలో వందలాది మంది ఈ వీడియోను పంచుకుంటూ, తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైన సిస్టమ్.. ఒత్తిడిలోనూ నెగ్గే మానవ వనరులు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వైద్యులు అంటే ఇలా ఉండాలి. వాళ్లదే నిజమైన ధైర్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన మరోసారి మనం గుర్తుంచుకోవాల్సిన పాఠాన్ని నేర్పింది. పని పరమ ధర్మం అనే సిద్ధాంతాన్ని జీవితంలో అమలు చేసినవారే నిజమైన హీరోలు. ఇది కేవలం డాక్టర్ల ధైర్యానికి కాదు, మనిషి ధైర్యానికి, పట్టుదలకి జీవం పోసిన ఉదాహరణ.