Groom Digital Verification| ఒక 22 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో తన కథను షేర్ చేసింది. ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఆమెను ఒక యువకుడితో పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఒక సైకో అని తెలిసి అతి కష్టం మీద అతడి బారి నుంచి తప్పించుకున్నానని ఆమె వివరించింది. అందుకే పెళ్లికి ముందు డిజిటల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఎందుకు ముఖ్యమో ఆమె తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్‌లో ఆమె తనకు బలవంతపు పెళ్లి చేస్తున్నారని మొదట్లో పోస్ట్ చేసినప్పుడు.. ఒక యూజర్ ఆమె సమస్యపై స్పందిస్తూ.. ఆ వ్యక్తి సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఉనికిని చెక్ చేయాలని .. అలా చేస్తే అతడి నిజస్వరూపం బయటపడుతుందని సూచించాడు. అలా చేయడం ద్వారా ఆమెకు ఆ వరుడు పైకి కనిపిస్తున్నంత మంచి వాడు కాదని.. అతను ఎంత దుర్మార్గుడో తెలిసిపోయింది. ఇదంతా ఆమె వివరంగా మరో పోస్ట్ లో షేర్ చేసింది.
ఆమె తన పోస్ట్‌కు “2025లో అరేంజ్డ్ మ్యారేజ్: అమ్మాయిలు ఎందుకు పూర్తి డిజిటల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి (నా కథ)” అని టైటిల్ పెట్టింది. “నేను అన్నీ చెక్ చేశాను, అప్పుడు కొందరు ‘పేరున్న’ వ్యక్తులు బయటికి మంచివారిలా కనిపించినా లోపల ఎంత ప్రమాదకరంగా ఉంటారో తెలిసింది. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి ఈ కథను షేర్ చేస్తున్నాను,” అని ఆమె రాసింది.
ఆమె పెళ్లి చేసుకోవాడనికి వచ్చిన యువకుడి మంచి ఉద్యోగం ఉంది. చూసేందుకు మంచి పేరుగల కుటుంబానికి చెందినవాడిలా కనిపిస్తాడు. కానీ వ్యక్తిగతంగా మాత్రం అతను ఒక సైకో. అతడిది మానిపులేటివ్, భావోద్వేగంగా అస్థిరంగా ఉండే మనస్తత్వం. అతను అనుమతి లేకుండా అసభ్య ఫోటోలు పంపాడు, స్వీయ-హాని గురించి గొప్పలు చెప్పాడు, సమ్మతిని పట్టించుకోలేదు, కాబోయే భార్యను నియంత్రించడానికి ఇష్టపడేవాడు. అతని నిజస్వరూపం తెలుసుకోవడానికి ఆ యువతి తన స్నేహితురాలి ఐడీని ఉపయోగించి అతనితో మాట్లాడింది. అతని ఆన్‌లైన్ ప్రవర్తన “భయానకంగా” ఉందని ఆమె చెప్పింది. అతను తన స్నేహితురాలికి అసభ్య ఫోటోలు పంపడమే కాక, పోర్న్ చూడటం సాధారణమని గొప్పగా చెప్పాడు.
ఇదంతా వివరిస్తూ.. ఆ యువతి తన తోటి అమ్మాయిలకు ఒక సందేశం ఇచ్చింది. “ఉద్యోగం లేదా కుటుంబ పేరును ఎప్పుడూ నమ్మవద్దు. అబ్బాయి.. లింక్డ్‌ఇన్, పాత ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ వంటి డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లను చెక్ చేయండి.” అని రాసింది. ఆ సైకో పెళ్లి కొడుకు గురించి ఆమె తన కుటుంబానికి చెప్పింది. “జాగ్రత్తగా చూడండి, కళ్లుమూసుకొని ఎవరినీ నమ్మవద్దు, మీ మనశ్శాంతిని కాపాడుకోండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే, అది తప్పే,” అని ఆమె చెప్పింది.
Also Read: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ చాటుగా ప్రవేశించిన బాస్.. ఆమె రాగానే అండర్‌వేర్‌లో..
యువతి కథపై సోషల్ మీడియాలో కామెంట్లు
ఈ పోస్ట్ వైరల్ అయింది. ఒక యూజర్ అమె కథపై కామెంట్ చేస్తే.. “ఫ్రీలాన్స్ సైబర్‌సెక్యూరిటీ నిపుణుడిని నియమించవచ్చు, అతను సోషల్ మీడియా పోస్ట్‌లు/కామెంట్స్ కంటే ఎక్కువ సమాచారాన్ని తవ్వగలడు,” అని సూచించాడు.
మరొకరు, “ఏది జరిగినా దూరంగా ఉండండి. నా స్నేహితురాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది, పదేళ్ల తర్వాత ఆమె జీవితం పీడకల కంటే దారుణంగా ఉంది. ఆమె కుటుంబం అంతా తెలిసినా ఏమీ చేయలేదు,” అని అన్నారు.
“అతను తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ షేర్ చేయడానికి ఎంత సౌకర్యంగా.. ఇష్టంగా ఉన్నాడో చూడటమే ఉత్తమ పరీక్ష,” అని మరొక యూజర్ చెప్పాడు. ఇంకొక యూజర్ అయితే.. “ఇది అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాకూడదు. అబ్బాయిలు కూడా పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి,” అని రాశారు.
డిజిటల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం ఈ కాలంలో ఎంత అవసరమో ఈ యువతి కథ స్పష్టం చేస్తుంది. ఆమె అనుభవం ద్వారా, పెళ్లికి ముందు సదరు వ్యక్తి ఆన్‌లైన్ లో ప్రవర్తనను పరిశీలించడం ఎంత అవసరమో తెలుస్తుంది. సోషల్ మీడియా పోస్ట్‌లు, కామెంట్స్, ఇతర డిజిటల్ ఆధారాలు ఒక వ్యక్తి యొక్క నిజ స్వభావాన్ని వెల్లడిస్తాయి.