Gurugram Techie Food Spending:ప్రతిరోజూ జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు పెట్టే అలవాటు ఉందా? అయితే ఒక్కసారి ఇది చూడండి. మనం చేసే చిన్న చిన్న ఖర్చులు మన పర్సుకి ఎంత పెద్ద బొక్క చూపిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.తాజాగా ఓ గుర్‌గావ్ ఐటీ ఉద్యోగి తన మూడు నెలల ఫుడ్ ఖర్చులను లెక్కేసుకుని షాక్‌కు గురయ్యాడు. కేవలం 90 రోజుల్లో అతను ఫుడ్ డెలివరీ యాప్స్, చుట్టుపక్కల రెస్టారెంట్ల కోసం ఏకంగా రూ.35,400 తగలేశాడు. ఈ విషయాన్ని ఆ యూజర్ ‘రెడ్డిట్’ వేదికగా పంచుకుంటూ, ఈ నంబర్లు చూశాక నాకే భయమేసింది అంటూ వాపోయాడు.
సాధారణంగా రోజుకు రూ .200 లేదా రూ.300 ఆర్డర్ పెడితే పెద్దగా అనిపించదు కానీ, వాటిని మొత్తంగా ఒకసారి లెక్కేసినప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ యూజర్ షేర్ చేసిన మంత్లీ బ్రేకప్ ప్రకారం మొదటి నెల రూ11,400, రెండవ నెల రూ. 13,200, మరియు మూడవ నెల రూ.10,800 చొప్పున మొత్తం రూ.35,400 ఖర్చయింది. తాను పీజీలో ఉంటానని, ఆకలేసినప్పుడల్లా జొమాటో ఓపెన్ చేయడం లేదా రూమ్ పక్కన ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లడం అలవాటుగా మారిందని, తీరా మూడు నెలల తర్వాత కూర్చుని లెక్కలు కడితే మైండ్ బ్లాంక్ అయిందని అతడు పేర్కొన్నాడు.
also read :మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?
ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, అంత డబ్బు ఖర్చు పెట్టేసినా అతనికి క్వాలిటీ ఫుడ్ దక్కలేదు. తాను పెట్టిన ఖర్చులో ఎక్కువ భాగం ఆన్‌లైన్ డెలివరీలకే పోయిందని, కానీ ఎప్పుడూ క్వాలిటీ ఒకేలా ఉండేది కాదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. చాలాసార్లు ఫుడ్ తిన్నాక ఏదో అసంతృప్తి మిగిలేదని, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్క్రోల్ చేస్తూ టైంపాస్ చేయడం అలవాటైందని చెప్తూ అర్బన్ లైఫ్‌స్టైల్‌లోని లోపాలను ఎండగట్టాడు. అంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, పరోక్షంగా ఆరోగ్యం కూడా పాడవుతోందనే హెచ్చరిక ఈ పోస్ట్‌లో కనిపిస్తోంది. మెట్రో సిటీస్ అయిన గుర్‌గావ్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్ల యువత ఈ ‘కన్వీనియన్స్ ట్రాప్’ (సౌకర్యాల వల) లో దారుణంగా చిక్కుకుపోతున్నారు.ఈ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవ్వగానే నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. కొందరైతే గుర్‌గావ్, బెంగళూరు లాంటి సిటీల్లో బ్రతకడమే ఖరీదని, ఈ ఖర్చు చాలా నార్మల్ అని సపోర్ట్ చేసుకొచ్చారు.మరికొందరు మాత్రం ఫైనాన్షియల్ డిసిప్లెన్ ముఖ్య్యమని అని హెచ్చరిస్తున్నారు
నెలకు ఒక రూమ్ మేట్‌ని పెట్టుకుని వంటమనిషిని హైర్ చేసుకుంటే రూ.4,000 లోపే హెల్తీ ఫుడ్ దొరుకుతుందని, ఇలా యాప్స్‌కి బానిసలు కాకండి అని సలహాలు ఇస్తున్నారు. రూ. 35 వేలు అనేది ఒక సాధారణ ఉద్యోగి నెల జీతం కావచ్చు, అలాంటిది కేవలం మూడు నెలల జంక్ ఫుడ్‌కే అంత తగలేయడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. చిన్న చిన్న ఖర్చులే కదా అని లైట్ తీసుకుంటే లాంగ్ రన్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వడం ఖాయం. ఈ రోజే మీరు ఫుడ్ యాప్స్‌కి ఎంత సమర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి.