E-Paper
Advertisement

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. లేబర్ కార్డుల దందాపై కదిలిన యంత్రాంగం!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. లేబర్ కార్డుల దందాపై కదిలిన యంత్రాంగం!
Advertisement

Swetcha Effect: లేబర్ కార్డులతో దగా అనే శీర్షికన శుక్రవారం స్వేచ్ఛ దినపత్రికలో వచ్చిన వార్తకు జిల్లా ఈడిఎం, లేబర్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు గద్వాలలో అధికారికంగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో లేబర్ కార్డుల జారీకి దళారులతో కలిసి చేస్తున్న దందాపై సంబంధిత అధికారులు ఈడీఎం శివకుమార్, జిల్లా కార్మిక శాఖ అధికారి వేణుగోపాల్, డి ఎం సుధాకర్ రెడ్డి మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

దళారుల దందా..

అర్హులైన కార్మికులకు అందాల్సిన లేబర్ కార్డుల జారీ దళారుల దందాలో భాగంగా లాభార్జనే ధ్యేయంగా యథేచ్ఛగా కార్డుల జారీపై స్వేచ్ఛ దినపత్రికలో ప్రచురించింది. గ్రామాలలో అధికారిక మీసేవ ఐడీలను లేబర్ కార్డుల జారీకి దుర్వినియోగపరచడంపై ఇటీవల చేసిన ట్రాన్జక్షన్లను అధికారులు పరిశీలించారు. జరిగిన ఘటనపై షోకాజ్ నోటీసు జారీ చేసి సకాలంలో సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని ఈడియం శివకుమార్ తెలిపారు.

Advertisement

Also read: South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

మీసేవ ఐడీలు రద్దు..

జిల్లాలో ప్రభుత్వం కేటాయించిన మీసేవ ఐడీలను అనైతికంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తే ఆయా సెంటర్లను రద్దు చేయాల్సి వస్తుందని సెంటర్ల నిర్వాహకులు బాధ్యతతో ప్రజలకు జవాబుదారితనంతో, వివిధ సర్వీసులకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని, లేనిచో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Also read: Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

Related News

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్.. ఉచిత పైలట్ ట్రైనింగ్, ఇంకెందుకు ఆలస్యం

హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!

జీతాలైతే తీసుకుంటున్నారు.. ఆదాయమేది? ఐఏఎస్‌లపై సర్కార్ ఆగ్రహం!

ప్రభుత్వ జీతం.. సొంత వ్యాపారం.. టీచర్ల భాగోతంపై ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్!

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక ప్రక్రియపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ హైకమాండ్-కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

Big Stories

Advertisement
×