Prabhas Promotions: డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతలా కష్టపడతారో మనందరికీ తెలిసిందే. తన మార్క్ ఫన్నీ ఇంటర్వ్యూలు, కాన్సెప్ట్ వీడియోలతో సినిమా రిలీజ్‌కు ముందే థియేటర్ల వైపు జనాలు అడుగులు వేసేలా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ అంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం మాత్రమే కాదు, ప్రేక్షకులను ఆకట్టుకునేలా వెరైటీ గా ప్లాన్ చేయాలని ఆయన నిరూపించారు. ఇప్పుడు అదే రూట్‌ను పాన్ ఇండియా సెన్సేషన్ నాగ్ అశ్విన్ కూడా ఫాలో అవుతుండటం టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. ‘కల్కి 2898 AD’ లాంటి విజువల్ వండర్‌తో గ్లోబల్ లెవెల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నాగ్ అశ్విన్, ప్రస్తుతం కల్కి 2తో బిజీగా ఉంటూనే.. రీసెంట్‌గా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్‌ను రంగంలోకి దించారు. దాంతో ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కలల ప్రాజెక్ట్ అయిన ‘సింగ్ గీతం’ సినిమాకు నిర్మాత నాగ్ అశ్విన్. సినిమా చరిత్రలోనే మాటలు లేకుండా, కేవలం పాటల ద్వారానే పూర్తి కథను నడిపించిన ఒక అద్భుతమైన ప్రయోగం ఇది. ఈ సినిమా విశేషాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ ఒక స్పెషల్ ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నాగ్ అశ్విన్‌ను సరదాగా ఆటపట్టించడం విశేషం.
Publicity Volume Penchamantunna DINOSAUR…🦖
Rebel Star #Prabhas for #SingGeetham ❤️✨
A special video coming soon!!https://t.co/BlPIUZp006#SingeethamSrinivasaRao @ThisIsDSP @nagashwin7 @VyjayanthiFilms @SwapnaCinema @VyjayanthiMusic @divomusicindia pic.twitter.com/mhZhADNWas— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 19, 2026
also read :జొమాటో, స్విగ్గీ వాడుతున్నారా? ఈ బిల్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!
“ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇలాంటి ప్రయత్నం ముందెన్నడూ జరగలేదు, మాటల స్థానంలో కేవలం పాటలతోనే కథ చెప్పారు” అని నాగ్ అశ్విన్ సీరియస్‌గా చెప్తుంటే.. పక్కనే ఉన్న ప్రభాస్ ఎంటరై, “అలా కాదు డార్లింగ్.. ఇంకా గట్టిగా చెప్పాలి, జనాల్లోకి బలంగా వెళ్ళాలి” అంటూ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ నిజంగానే మరింత గట్టిగా అరుస్తూ ఆ విషయాన్ని చెప్పడం నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది. ఈ ఫన్నీ కెమిస్ట్రీ చూసిన ఆడియన్స్.. మన నాగ్ అశ్విన్ కూడా అనిల్ రావిపూడి స్టైల్ ప్రమోషన్స్ నేర్చేసుకున్నారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల నాటి తన కలని నాగ్ అశ్విన్ భుజాన వేసుకుని నిజం చేశారని, దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని సింగీతం శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
ఒకవైపు ఈ ప్రమోషన్స్ నెట్టింట హల్‌చల్ చేస్తుంటే, మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2’ అప్‌డేట్స్ కూడా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల కీలక షెడ్యూల్స్ పూర్తయినట్లు ఇన్సైడ్ టాక్. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలు కేవలం రెండో భాగంతోనే ఆగిపోవడం లేదు. కల్కి సినిమాను ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌గా విస్తరించాలని ఆయన గట్టి ప్లాన్‌లో ఉన్నారట.
ఇందులో భాగంగానే మొదటి పార్ట్‌లో కేవలం కొద్ది నిమిషాల పాటే కనిపించి మెప్పించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ల పాత్రల బ్యాక్‌స్టోరీల ఆధారంగా ప్రత్యేకమైన స్పిన్-ఆఫ్ సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ మార్వెల్ సినిమాల తరహాలో ఈ క్యారెక్టర్ బేస్డ్ ఓటీటీ కంటెంట్ రూపుదిద్దుకుంటే మాత్రం టాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. మొత్తంగా సినిమా ప్రమోషన్స్ దగ్గరి నుండి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ వరకు నాగ్ అశ్విన్ వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందనే చెప్పాలి.