E-Paper

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?
Advertisement

Rajamouli Garuda: ఎస్ ఎస్ రాజమౌళి…  ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో బెంచ్ మార్క్ సెట్ చేసిన వెర్సటైల్ డైరెక్టర్. అలా బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్ మార్కెట్ ని  విస్తరించిన జక్కన్న,RRR చిత్రంతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా జెండాను ఎగరేశారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్ సైతం రాజమౌళి మేకింగ్ స్టైల్‌ను ప్రశంసించారంటే ఆయన విజన్ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రాజమౌళి చేస్తున్న వారణాసి ప్రాజెక్ట్ కేవలం టాలీవుడ్ లేదా ఇండియన్ సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపుదిద్దుకుంటోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రం సెట్స్  మీద ఉండగానే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో రాజమౌళి నెక్స్ట్  ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు సినిమా అనంతరం జక్కన్న మళ్లీ తన లక్కీ హీరో వైపు అడుగులు వేస్తున్నట్లు బలంగా టాక్ వినిపిస్తోంది.

Advertisement

చరణ్ తో సినిమా చేయబోతున్న జక్కన్న

రాజమౌళి సాధారణంగా ఒకసారి పనిచేసిన హీరోలతో వెంటనే సినిమాలు చేయరు. కానీ ఆయన కెరీర్‌లో ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ, RRR వంటి నాలుగు చిత్రాలు, ప్రభాస్‌తో ఛత్రపతి, బాహుబలి 1 & 2 వంటి మూడు సినిమాలు చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసిన మగధీర (2009), RRR (2022) చిత్రాలు టాలీవుడ్ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా మగధీర సాధించిన కలెక్షన్ల రికార్డుల తర్వాతే తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం మొదలైందని చెప్పొచ్చు.

Advertisement

also read :మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో చరణ్‌కు గ్లోబల్ వైడ్‌గా వచ్చిన ఇమేజ్ చూశాక, రాజమౌళి మరో సారి చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడని సమాచారం.అవును .. మహేష్ బాబు ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్‌తో చేతులు కలపడానికి జక్కన్న స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో 

ఇక వారణాసి ప్రాజెక్ట్ పూర్తయ్యాక, రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గరుడ’ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సరికొత్త లీకులు అందుతున్నాయి. గతంలోనే గరుడ అనే భారీ చారిత్రక/ఫాంటసీ కథపై రాజమౌళి వర్క్ చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ అంతర్జాతీయ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ గరుడ ప్రాజెక్ట్‌ను చరణ్‌తోనే సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

also read :Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అనౌన్స్మెంట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్ ఈ వార్తను తెగ ట్రెండ్ చేస్తున్నారు.చూడాలి మరి మళ్లీ ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో !

Related News

గట్టిగా చెప్పమన్న ప్రభాస్.. అరిచి మరీ చెప్పిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్!

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!

మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగినా మీకు ఆ అర్హత రాదు.. పేర్ని నానికి కిరాక్ ఆర్పీ లెఫ్ట్ అండ్ రైట్!

డబ్బుంది కదా అని బిల్డప్ లేదు.. నడిరోడ్డుపై నిద్రపోయిన బాలీవుడ్ సెలబ్రిటీ..

షారుక్ మాటతో 42 లక్షల బిల్లు మాఫీ..కట్ చేస్తే ఇప్పుడు 80 కోట్ల సినిమా

Big Stories

×