BigTV English

Plane Handbag: ఈ విమానం హ్యాండ్ బ్యాగ్ ధరతో ఓ ఇల్లు కొనేయొచ్చు, దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Plane Handbag: ఈ విమానం హ్యాండ్ బ్యాగ్ ధరతో ఓ ఇల్లు కొనేయొచ్చు, దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

రకరకాల హ్యాండ్ బ్యాగ్లును వాడుతూ ఉంటారు మహిళలు. వారి కోసమే ఎన్నో రకాల హ్యాండ్ బ్యాగులు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇక్కడ మేము ఫోటోలో చూపిస్తున్నది అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్. ఇది కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. చూడడానికి విమానం ఆకారంలో కనిపిసతుంది. దీన్ని కొనేందుకు మీరు ఎకరం పొలం అయినా అమ్మాల్సిందే. దీని ఖరీదు 33 లక్షల రూపాయలకు పై మాటే. చిన్న విమానాన్ని పోలి ఉండే ఈ హ్యాండ్ బ్యాగ్ కు రెక్కలు, జెట్ ఇంజన్లు, కాక్ పిట్ కూడా ఉన్నాయి.


ఈ హ్యాండ్ బ్యాగ్ లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినది. దీన్ని వర్జిల్ అబ్లో అనే సెలబ్రిటీ డిజైన్ చేశాడు. అతని సృజనాత్మక ఆలోచన ఎంతోమందికి ఇట్టే నచ్చేసింది. అయితే వర్జిల్ మరణించాడు. దీన్ని 2021లో తయారు చేసినట్టు చెబుతారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ హ్యాండ్ బ్యాగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.

ఇక్కడ కనిపించే ఈ విమానం హ్యాండ్ బ్యాగ్ నిజానికి అమ్మాయిలు కోసం తయారు చేసింది కాదు, అబ్బాయిల కోసం చేసింది. కానీ అబ్బాయిల కన్నా అమ్మాయిలే దీనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ బ్యాగు ఫోటో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది దీన్ని వెర్రిగా చెప్పుకుంటే… మరికొందరు తయారీ విధానం చూసి మేధావిలా చేశాడని మెచ్చుకుంటున్నారు.


ఈ హ్యాండ్ బ్యాగ్ లక్షల ఖరీదు ఎందుకు చేస్తుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. దీన్ని తయారు చేసిన తోలు అంటే లెదర్ ఎంతో ఖరీదైనది. ఆ తోలు కోసం కూడా ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. బ్యాగులు లగ్జరీలకు చిహ్నాలు. సెలబ్రిటీలు, కోటీశ్వరులు మాత్రమే ఈ బ్యాగులను వాడుతూ ఉంటారు. ఇవి లిమిటెడ్ ఎడిషన్ లో తయారవుతాయి. అంటే ఒకటి లేదా రెండు బ్యాగులు మాత్రమే ఇలాంటివి ప్రపంచంలో ఉంటాయి.

ఈ విమాన హ్యాండ్ బ్యాగ్ లాగే ప్రపంచంలో ఖరీదైన హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. అందులో ఒకటి మిల్క్ కాటన్ బ్యాగ్ ఒకటి. దీని ఖరీదు పదివేల డాలర్లు. 1950లో పాల డబ్బాలు ఎలా ఉంటాయో.. అలా దీన్ని తయారు చేశారు. అలాగే హాట్ డాగ్ ఆకారంలో 5,800 డాలర్ల ఖరీదుతో ఒక క్లచ్ పర్సును తయారు చేశారు. ఇది మెరిసిపోతూ ఎంతో అందంగా ఉంటుంది.

ఇక టెడ్డి బేర్ బ్యాగ్ అయితే పిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది. దీని ఖరీదు 3 వేల డాలర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా దీన్ని వాడవచ్చు.

Related News

Body Double: ట్రంప్‌ను కలిసింది పుతిన్ కాదా.. ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Big Stories

×