Mexico Floods: మెక్సికో (Mexico)లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుయిడోసోలో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి (Homes Swept Away). ఇందుకు సంబంధించిన వీడియోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
20 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న రుయిడోసో నది
రుయిడోసో నది 20 అడుగుల కంటే.. ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ నది మిత స్థాయిలో ప్రవహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా వచ్చిన వర్షాల వల్ల.. నది ఉధృతంగా మారింది. చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలను వరద నీరు కమ్మేసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇళ్లలోనే ఉండటం వల్ల రక్షణ చర్యలు కష్టతరంగా మారాయి.
ఇళ్లపైకి చేరిన వరద నీరు – నివాసితుల ఉక్కిరిబిక్కిరి
కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ల లోపలికి ప్రవేశించి, ఫర్నిచర్, వాహనాలు, వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయి. కొందరు వృద్ధులు, చిన్నారులు సురక్షితంగా బయటపడలేకపోయారు. సహాయక బృందాలు బోట్ల సహాయంతో వారికి సహాయం చేస్తుండగా, వరద నీటి ప్రవాహం వేగంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువైంది. ఇప్పటికే పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
రుయిడోసో గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవసరం లేకపోతే ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. పహాడ్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు. అవసరమైతే ఎమర్జెన్సీ సెంటర్లలో ఆశ్రయం పొందాలని, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
రక్షణ చర్యలు ముమ్మరం
ప్రభుత్వం వెంటనే ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించింది. ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్, రెస్క్యూ టీమ్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా నదుల ప్రవాహం, పొంగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయ చర్యల్లో జాప్యం జరగకుండా.. అధికార యంత్రాంగం వేగంగా స్పందిస్తోంది.
Also Read: కేరళ నర్సు నిమిషిప్రియకు ఉరిశిక్ష.. బాధిత ఫ్యామిలీతో సంప్రదింపులు, భారమంతా వారిపై
వాతావరణ శాఖ హెచ్చరిక
వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు, వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక జలమానిటరింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు మరణాల సమాచారం తెలియకపోయినప్పటికీ, ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మెక్సికోలో వరదల బీభత్సం
రుయిడోసోలో ఆకస్మిక వరదలతో అల్లకల్లోలం
వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఇళ్లు
20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోన్న రుయిడోసో నది
రుయిడోసో గ్రామంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు#MexicoFloods pic.twitter.com/hzRvOXyNBY
— BIG TV Breaking News (@bigtvtelugu) July 9, 2025
The Ruidoso River in New Mexico rose 20 feet in roughly 30 minutes earlier today resulting in widespread flooding
Structure swept away by flash flooding at Rio Ruidoso River in New Mexico#ruidoso #newmexico #flooding #weather #insane #RuidosoRiver #RuidosoFlood pic.twitter.com/a8H9Lxepzq
— Bharat Insight (@Insight_029) July 9, 2025