BigTV English

Whale Vomit: కోట్ల విలువ చేసే చేప ఉమ్మిపై ఇండియాలో నిషేధం.. ఎందుకంటే?

Whale Vomit: కోట్ల విలువ చేసే చేప ఉమ్మిపై ఇండియాలో నిషేధం.. ఎందుకంటే?

Whale Vomit| గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సముద్రంలో నివసించే అతిపెద్ద చేప వేల్ ఉమ్మి, వాంతిక పదార్థంతో అతను అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడని తెలిసి పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వేల చేప ఉమ్మి విలువ చాలా ఖరీదు. ఒక కిలో రూ.1 కోటి పై మాటే. అలాంటిది ఆ వ్యక్తి నుంచి 1.165 కిలో గ్రాముల వేల్ చేప ఉమ్మిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.1.16 కోట్లు అని మీడియాకు వెల్లడింాచరు.


వేల చేప వాంతిక లేదా ఉమ్మిని ఆంబర్‌గ్రిస్ (Ambergris) అని అంటారు. వేల చేప కడుపు జీర్ణకోశంలో దీని ఉత్పత్తి జరుగుతుంది. చేప సముద్రంలో వాంతులు చేసినప్పుడు.. ఈ పదార్థం తేలియాడుతూ ఉంటుంది. దీన్ని పర్‌ఫ్యూం (సుగంధ ద్రవ్యాలు),  కెమికల్స్ తయారు చేసేందకు వినియోగిస్తారు. ముఖ్యంగా చైనా లో దీనికి విపరీతంగా డిమాండ్ ఉంది. అందుకే భారత్,ఇతర ఆసిమా దేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి ఈ ఆంబర్‌గ్రిస్ పదార్థాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.

తాజాగా గుజరాత్ లోని భావ్ నగర్ ఝోగ్ రోడ్డు పోలీస్ స్టేషన్ కు ఆంబర్‌గ్రిస్ అక్రమ రవాణా గురించి రహస్యంగా సమాచారం అందింది. నగరంలో నివసించే ఆమ్రుభాయ్ సెలార్ భాయ్ దేశాయ్ (32) అనే వ్యక్తి శివాజీ సర్కిల్ మీదుగా ఒక కిలోకి పైగా బరువు తల ఆంబర్‌గ్రిస్ తీసుకెళుతున్నాడని తెలిసింది. దీంతో పోలీసులు కాపు కాసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 1.165 కేజీల ఆంబర్‌గ్రిస్ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.


నిందితుడు ఆమ్రుభాయ్ భావనగర్ జిల్లా ఖారసలియా గ్రామానికి చెందిన వాడని.. గతంలో డ్రైవర్ గా ఉద్యోగం చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఆంబర్‌గ్రిస్ స్మగ్లింగ్ చేసే ముఠాని పట్టుకునేందుకు లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.

Also Read: 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. పెద్ద కథే!

రెండు వారాల క్రితం కర్ణాటకలోని కొడుగు జిల్లాలో కూడా 10.39 కేజీల ఆంబర్‌గ్రిస్ ని (Ambergris) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కొడుగు జిల్లా హెగ్గల జంక్షన్ సమీపంలో విరాజ్ పేట పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి ఆంబర్‌గ్రిస్ అక్రమ రవాణా చేస్తున్న 10 మందిని పట్టుకున్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగుళూరుకు తీసుకెళుతుండగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫ్లోటింగ్ గోల్డ్ (నీటి తేలియాడే బంగారం) గా పిలవబడే ఈ ఆంబర్‌గ్రిస్ ని స్పెర్మ్ వేల్స్ ఉమ్మి వేయడంతో సముద్ర ఉపరితలంపై తేలాడుతూ ఉంటుంది. భారత దేశంలో ని వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 2 ప్రకారం.. స్పెర్మ్ వేల్స్ చేపలు సంరక్షిత జాబితాలో ఉన్నాయి. ఈ చేపలు లేదా వీటి ఉత్పత్తులతో వ్యాపారం చేయడంపై నిషేధం ఉంది.

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×