Cool Drink: ఎండలకు చల్లని కూల్ డ్రింక్ తాగుతున్నారా ? ఐతే బీకేర్‌ఫుల్..! ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కూల్ డ్రింక్ తాగండి. లేదంటే ఆస్పత్రి పాలవ్వడం గ్యారంటీ. కూల్ డ్రింక్స్‌లో పురుగులు, ఈగలే కాదు, చనిపోయిన బల్లి అవశేషాలు కూడా దర్శనమిస్తున్నాయ్.
మనం తినే ఆహారంలో లేదా తాగే ద్రవాల్లో బల్లి పడిందని తెలిస్తే.. అప్పుడు మనకు కలిగే పరిస్థితి వర్ణించలేం. ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. బల్లి పడ్డ ఆహారం తీసుకుంటే వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటాయి. అయితే ఒక యువకుడి గమనించకుండా కూల్ డ్రింక్ తాగి అస్వస్థకు గురయ్యాడు.
వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా పెద్దపూర్‌కు చెందిన ఇద్దరు యువకులు.. నేషనల్ హైవే పక్కన రెస్టారెంట్‌లో కూల్ డ్రింక్ కొన్నారు. ఓ యువకుడు ఏమీ గమనించకుండా కూల్ డ్రింగ్ తాగేశాడు. ఆ వెంటనే వాంతులు చేసుకున్నాడు. ఏమైందని కూల్ డ్రింగ్ బాటిల్ చూడగా, అందులో చనిపోయిన బల్లి కన్పించింది. ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా తమకేం సంబంధం లేదన్నట్లు రిప్లై ఇచ్చారు.
Also Read: లేడీ అఘోరీపై సంచలన వీడియో చేసిన అన్వేష్.. ఆ మాటలేంటి అన్వేష్..!
ప్రస్తుతం కూల్ డ్రింక్ తాగిన వ్యక్తి ఆరోగ్యం అస్వస్థతో బాధపడుతున్నాడు. బల్లి పడిన ఆహారాన్ని తింటే వాంతులు , కడుపునొప్పి, అతిసారం లాంటి సమస్యలు వస్తాయి. చనిపోయిన బల్లిని చూస్తే అది ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే బయట ఆహారం తినేటప్పుడు కానీ, కూల్ డ్రింక్ తాగేటప్పుడు కానీ జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి.