Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ ఎదురుదాడి నేపథ్యంలో ఇండో-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతో భాగంగా ఇవాళ(మే 7న) దేశ వ్యాప్తంగా సైన్యం మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. ఒకవేళ వైమానిక దాడులు జరిగితే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంకు దాడిముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో రెండు నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ రైడ్ సైరన్ మోగిస్తారు. ఇంతకీ, ఎయిర్ రైడ్ సైరన్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? పౌరులు ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. .
ఎయిర్ రైడ్ సైరన్ అంటే ఏంటి?
ఎయిర్ రైడ్ సైరన్ అనేది శత్రు దేశాలకు సంబంధించి వైమానిక దాడులు లేదంటే క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తారు. ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలని చెప్పడమే ఈ సైరన్ ఉద్దేశం. యుద్ధ పరిస్థితులు తలెత్తడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ సైరన్ లు మోగుతాయి. ఈ సైరన్ అనేది దాదాపు 60 సెకన్ల పాటు మోగుతుంది. ప్రజలు వెంటనే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవాలని సూచిస్తుంది.
రైడ్ అలారం మోగితే ఏం చేయాలి…
అందరికీ షేర్ చేయండి…
భారత ప్రభుత్వంజారీ చేసిన వీడియో…#MockDrill #mockdrill2025 pic.twitter.com/8LaevtYQms— Devika Journalist (@DevikaRani81) May 6, 2025
మాక్ డ్రిల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు హెచ్చరికలు
మాక్ డ్రిల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు హెచ్చరికలు జారీ చేయనున్నాయి. డ్రిల్ సమయంలో అన్ని 4G, 5G స్మార్ట్ ఫోన్లు బిగ్గరగా బీప్, వైబ్రేషన్ తో పాటు అత్యవసర సందేశాన్ని అందుకుంటాయి. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా దాదాపు 10 సెకన్ల పాటు బిగ్గరగా శబ్దం చేస్తుంది.
అలారం మోగిన సమయంలో ఏం చేయలి?
దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్ కావాలనే విషయాన్ని సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎయిర్ రైడ్ సైరన్ మోగగానే ఏం చేయాలో ఇందులో సూచించింది. “ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎయిర్ రైడ్ సైరన్ మోగగానే.. ప్రజలు అలర్ట్ కావాలి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ముందుగా ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలను అన్నింటినీ ఆపివేయాలి. లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్ సహా అన్నింటిని ఆఫ్ చేయాలి. కర్టెన్స్ ఓపెన్ చేయాలి. కిటికీలను మూసివేయాలి. కుటుంబం అంతా సైలెంట్ గా ఇంట్లో కూర్చోవాలి. ప్రాంతంతో సంబంధం లేకుండా నగరంలోని అన్ని చోట్లా ఇదే పద్దతి పాటించాలి. అవసరం అయితే పరిసర ప్రజలను అలర్ట్ చేయాలి. చీకటి అనేది భయం కాదు, మన యూనిటీకి నిదర్శనం అని నిరూపించాలి” అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఇవాళ జరిగే సైనిక మాక్ డ్రిల్ సందర్భంగా ఆయా నగరాల్లోని ప్రజలు ఈ పద్దతిని పాటించాని సూచించింది.
Read Also: నిద్రలేచే లోపే లేపేశారు కదయ్యా.. పాకిస్తాన్‌పై పేలుతున్న జోకులు!