BigTV English

Indian American: విమానంలో అతడికి దెయ్యం పట్టిందా? భారతీయుడిని చితకబాదిన తోటి ప్రయాణీకుడు.. ఏమైంది?

Indian American: విమానంలో అతడికి దెయ్యం పట్టిందా? భారతీయుడిని చితకబాదిన తోటి ప్రయాణీకుడు.. ఏమైంది?

Indian American: విమానంలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలతో ప్రయాణికులు ఓ వైపు టెన్షన్ పడుతున్నారు. ఇంకోవైపు ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రక్తం కారేలా కొట్టుకున్నారు. మిగతా ప్రయాణికులు ఎంత విడిపించినప్పటికీ ఫలితం లేకపోయింది. విమానం ల్యాండింగ్ కాగానే భారత సంతతికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.


జూన్ 30 అనగా సోమవారం అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి మయామికి ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం వెళ్తోంది. ఈ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మాటా మాటా పెరిగింది. చివరకు ఘర్షణకు దారి తీసింది. అందులో ప్రయాణిస్తున్న భారత్ సంతతికి చెందిన 21 ఇషాన్ శర్మ.. తన ముందు సీటులో కూర్చొన్న కీను ఎవాన్స్‌పై దాడికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ముష్టిఘాతాలకు దిగారు. ఒకరిపై సీట్లపై మరొకరు ఎక్కి కొట్టేసుకున్నారు. తోటి ప్రయాణికులు విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వ్యవమారం జరుగుతుండగానే మరొకరు తమ ఫోన్లకు పని చెప్పారు. ఈ తతంగాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. విమానం గాల్లో ఉండగానే ఈ తతంగమంతా జరిగింది.


చివరకు విమానం మయామిఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కాగానే పోలీసులు విమానం వద్దకు చేరుకున్నారు. భారత సంతతికి చెందిన ఇషాన్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

ALSO READ: నవ్వకండి.. సీరియస్ మేటర్, సవతిలా మారిన చాట్ జీపీటీ

తన క్లయింట్ మత విశ్వాసాల ప్రకారం ధ్యానం చేసుకుంటున్నాడని కోర్టు దృష్టికి తెచ్చారు. దీన్ని సహించలేని వెనుకనున్న ఓ ప్రయాణికుడు గొడవ దిగాడని వివరించినట్టు స్థానిక న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి.  బాధితుడు కీను ఎవాన్స్ తరపు వాదన మరోలా ఉంది. ఇషాన్ శర్మ ప్రవర్తన వింతగా ఉందని, తనతో పెట్టుకుంటే చావు ఖాయమని బెదిరించాడని తెలియజేశారు.

ఈ విషయాన్ని విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లనని, సహాయం కోసం బటన్ నొక్కమని సూచించారని తెలిపారు. శర్మ బెదిరింపులు ఆపకపోవడంతో బటన్ నొక్కానని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత శర్మ తనపై దాడి చేసి గొంతు పట్టుకున్నాడని ఎవాన్స్ వివరించారు. ఆత్మరక్షణ కోసమే తాను ప్రతిఘటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఈ ఘటనకు సంబంధించిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. అతడు లేచి నా నుదిటిపై గట్టిగా కొట్టాడని, ఆ సమయంలో తనను తాను రక్షించుకోవడానికి చేయగలిగినదంతా చేశానని వివరించారు. ఈ గొడవలో శర్మ ఎడమ కనుబొమ్మపై గాయం అయ్యింది. ఎవాన్స్ ముఖంపై గీతలు పడ్డాయి.ఈ సంఘటనపై ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు.

 

Related News

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Big Stories

×