Most Cursed Paintings : ప్రపంచంలో హార్రర్ ఇన్సిడెంట్స్ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఇంట్లోకి తెచ్చుకునే ఎన్నో వస్తువులు మన చావుకు కూడా కారణం అవుతుంటాయి. ఇలాంటి ఘటనలు సాధారణంగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇంట్లో ఉండే చిన్న వస్తువు కూడా కొన్ని సార్లు ప్రాణాలను తీసే ప్రమాదం ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా కొన్ని పెయింటింగ్స్ అయితే చూడడానికి అద్భుతంగా ఉంటాయి.
పెయింటింగ్స్ ఇంట్లో పెడితే ఇంటికే అందం వస్తుంది అని భావిస్తారు. కానీ ఇంటి అలంకారం కోసం తెచ్చుకునే ఇలాంటి పెయింటింగ్స్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ కథ వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం. ఓ పెయింటింగ్ ఏకంగా వేల మంది ప్రాణాలను బలిగొంది. అది కూడా ఓ చిన్న బాలుడు ఏడుస్తున్న పెయింటింగ్ కావడం కూడా విశేషం. అసలు ఆ పెయింటింగ్ వల్ల ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యునైటెడ్ కింగ్డమ్లో ఓ ఏడుస్తున్న బాలుడి పెయింటింగ్ పుట్టుకొచ్చింది. అయితే అది ఒక శాపగ్రస్తమైన పెయింటింగ్ కూడా. ఇటాలియన్ చిత్రకారుడైన బ్రూనో అమాడియో అని కూడా పిలువబడే జియోవన్నీ బార్గోలిన్ గీసిన ఈ పెయింటింగ్ ఎన్నో వేల ప్రాణాలను తీసుకుంది. ఇది 1950వ సంవత్సరంలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రకారుడు ఇటలీలో ఉండడం లేదని కూడా నివేదికలు వెల్లడించాయి. అయితే మరోవైపు ఈ అబ్బాయి ఏడుపుకు సంబంధించిన పెయింటింగ్ ను ఫ్రెంచ్ కళాకారుడు బ్రూనో అమెడియో రూపొందించినట్లు అనేక పుకార్లు ఉన్నాయి.
Also Read: ఇదెలా సాధ్యం.. పాతిపెట్టిన నన్ మృతదేహాన్ని నాలుగేళ్ల తర్వాత వెలికితీయగా.. అంతా షాక్
పెయింటింగ్‌లో అమాయకమైన చిన్న పిల్లవాడి కళ్ల నుండి కన్నీరు కారుతూ ఉంటుంది. చిత్రకారుడు పెయింటింగ్ గీసే సమయంలో ఆహారం లేదా నీటి కోసం ఏడుస్తున్న పిల్లల చిత్రాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ పెయింటింగ్‌ను ఎవరైతే ఇంట్లో ఉంచుకుంటారో వారి ఇంట్లో ప్రమాదాలు ఎదురవుతాయని ఎన్నో ఘటనలు సాక్షాలుగా నిలిచాయి. అంతే కాదు, ఈ పెయింటింగ్ దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు తీసిందని కూడా ఎన్నో నివేదికలు తెలిపాయి.
1985లో బ్రిటీష్ టాబ్లాయిడ్ కాలిపోయిన ఇళ్ళ శిథిలాలలో పెయింటింగ్ కాపీలను గుర్తించినట్లు నివేదికల్లో తేలింది. అంతేకాదు యార్క్‌షైర్‌కు చెందిన పీటర్ హాల్‌తో సహా అగ్నిమాపక సిబ్బంది, కాలిపోయిన ఇళ్లలో పెయింటింగ్‌ను గుర్తించారు. పెయింటింగ్‌ను కొనుగోలు చేసిన ఆరు వారాల తర్వాత సర్రేలోని డోరా బ్రాండ్ ఇల్లు కూడా కాలిపోవడం, నార్ఫోక్లోని పారిల్లో పిజ్జా ప్యాలెస్ లో కూడా ఈ పెయింటింగ్ వల్ల అగ్నిప్రమాదం జరగడం వంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మీరు కూడా ఈ పెయింటింగ్‌ను మీ ఫోన్లోగానీ.. టాబ్లో గానీ సేవ్ చేసుకోడానికి ప్రయత్నించకండి. అనవసరంగా ప్రాణాలు పోతాయి. ఇలాంటి ‘ప్రాణాంతక’ పెయింటింగ్స్ ప్రపంచంలో ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు వివరిస్తాం.