BigTV English

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

BIG TV LIVE Originals: పాకిస్తాన్ దాని సరిహద్దు దేశమైన అప్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే అత్యంత దారుణమైన ఆచారం బచ్చా బాజీ. సాధారణంగా బచ్చా బాజీ అంటే పర్షియన్ భాషలో బాలుర ఆట అనే అర్థం ఉంది. ఈ ఆచారంలో భాగంగా  10 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులను అమ్మాయిలా వేషం వేస్తారు. పార్టీలు, వేడుకల్లో వారితో కలిసి పురుషులు డ్యాన్సులు వేస్తారు. ఇంకా చెప్పాలంటే వారిని అమ్మాయిలుగా ఊహించుకుని ఒళ్లంతా నలిపేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు.


ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తారు?

బచ్చా బాజీ అనే వేడుకలకు పేద కుటుంబాలకు చెందిన యువకులను ఎంపిక చేస్తారు. వారి ఫ్యామిలీస్ కు కొంత డబ్బు ముట్టజెప్తారు. వారికి అమ్మాయిల మాదిరిగా ఫ్యాన్సీ దుస్తుల వేస్తారు. వివాహాలు, ప్రైవేట్ పార్టీలలో డ్యాన్సులు చేయడానికి  శిక్షణ ఇస్తారు. డబ్బున్న వ్యక్తులు డబ్బులు ఇచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో డ్యాన్సులు చేసే అబ్బాయిలతో తరచుగా పెద్ద పురుషులు చెడుగా వ్యవహరిస్తారు.


బచ్చా బాజీతో సమస్య ఏంటి?

బచ్చా బాజీ అనేది ఎంతో మంది పేద యువకుల జీవితాలను నాశనం చేస్తుంది. వారి పేదరికం కారణంగా తల్లిదండ్రులు కొంత డబ్బును తీసుకుని వారిని ఈ వేడుకలు నిర్వహించే బృందాలకు అప్పగిస్తారు. వారు, వీరికి శిక్షణ ఇచ్చి, పలు వేడుకల్లో డ్యాన్సులు చేయిస్తారు. ఇది వారి బాల్యాన్ని దూరం చేస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది. శారీరకంగా, మానసికంగా  బాధను కలిగిస్తుంది. మానవ హక్కుల సంఘాలతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ ఆచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ లో కూడా చట్ట విరుద్ధం. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో రహస్యంగా జరుగుతుంది.

బచ్చా బాజీపై  నిషేధాజ్ఞలు

బచ్చా బాజీ సంప్రదాయం చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ లో ఉంది.  కొంత కాలం తర్వాత ప్రపంచ దేశాలు, ప్రజా సంఘాల నుంచి ఆందోళనలు కొనసాగడంతో ఈ సంప్రదాయంపై నిషేధం విధించారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అబ్బాయిలను రక్షించడానికి, ఈ ఆచారాన్ని కొనసాగించే వారిని శిక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాలు, సామాజిక కార్యకర్తలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్ధలు బచ్చా బాజీని పూర్తిగా లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాయి.

సామాజిక, చట్టపరమైన సవాళ్లు

పాకిస్తాన్‌ లో బాలల రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, అవగాహన లోపం, పేదరికం, సామాజిక అసమానతలు ఇటువంటి దురాచారాలను కొనసాగించడానికి కారణం అవుతున్నాయి. బచ్చా బాజీ వంటి సమస్యలను అరికట్టడానికి చట్ట అమలు, అవగాహన కార్యక్రమాలు, సమాజంలో మార్పు అవసరం. పాకిస్తాన్ ప్రభుత్వం బాలల రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read Also: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Love marriage ban: ప్రేమించారో గ్రామ బహిష్కారం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పెద్దలు.. ఎక్కడంటే?

Big Stories

×