BigTV English

Kerala Lottery: కేరళ లాటరీ టికెట్లను మనం కొనవచ్చా? ఇతర రాష్ట్రాలవారికి ఆ డబ్బు ఇస్తారా?

Kerala Lottery: కేరళ లాటరీ టికెట్లను మనం కొనవచ్చా? ఇతర రాష్ట్రాలవారికి ఆ డబ్బు ఇస్తారా?

అదృష్టాన్ని నమ్ముకునే వాళ్లు లాటరీ టికెట్లను నమ్ముకుంటారు. ఒక్కసారి లక్ తగిలినా లైఫ్ టర్న్ అయిపోతుందని భావిస్తారు. చాలా మంది ఎప్పుడో ఓసారి లక్ష్మీ దేవి తమ తలుపు తట్టదా? అనే ఉద్దేశంతో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఓనం సందర్భంగా కేరళలో పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీతో కేరళలో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ లాటరీ టికెట్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళ లాటరీ టికెట్లు ఎలా కొనుగోలు చేయాలి? నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


లాటరీ నియంత్రణ చట్టం ఏం చెప్తుందంటే?

ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ నియంత్రణ చట్టం ప్రకారం.. కేరళ లాటరీ టికెట్లను ఇతర రాష్ట్రాల్లో అమ్మకూడదు. అయితే, ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళకు వచ్చి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ వాళ్లు ప్రైజ్ మనీ గెలిస్తే అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి ప్రైజ్ మనీని తీసుకోవచ్చు. లాటరీ నియమాల ప్రకారం, లాటరీ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి లాటరీ టికెట్ అనేది కచ్చితంగా ఉండాలి. విజేత లాటరీని క్లెయిమ్ చేయడానికి లాటరీ ఆఫీస్ లో ఒరిజినల్ టికెట్‌ ను సమర్పించాల్సి ఉంటుంది.


ఆన్ లైన్ ద్వారా టికెట్ల కొనుగోలు చట్టవిరుద్ధం

ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫారమ్‌ ల ద్వారా లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. టికెట్లను విక్రయించడానికి లాటరీ ఏజెంట్లు అనేక వాట్సాప్ గ్రూపులను ప్రారంభించారు. ఇది పూర్తిగా ట్రస్ట్ ఫ్యాక్టర్ ఆధారంగా పని చేస్తుంది. చట్టపరమైన రక్షణ అనేది ఉండదు. ఈ గ్రూపుల ద్వారా టికెట్లు కొనుగోలు చేసి మోసపోయినా, ఏవైనా వివాదాలు తలెత్తినా ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన ప్రొటెక్షన్ ఇవ్వదు.

లాటరీ అమౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?

లాటరీ విన్నర్ అసలు టికెట్‌ ను సంబంధిత అధికారులకు సమర్పించినప్పుడు మాత్రమే ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ డబ్బును క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లలో లాటరీ గెలుచుకున్న ఒరిజినల్ టికెట్, ఫారమ్ నంబర్ VIIIలో స్టాంప్ చేసిన రసీదు, గెజిటెడ్ అధికారి సర్టిఫై చేసిన డాక్యుమెంట్ లేదంటే నోటరీ, 2 రీసెంట్ పాస్‌ పోర్ట్ సైజు ఫోటోలతో పాటు పాస్‌ పోర్ట్, రేషన్ కార్డ్, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులో ఏదో ఒకటి సమర్పించాలి. అప్పుడు డబ్బును విజేత బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఆదాయపు పన్ను, ఏజెంట్ కమీషన్ మినహాయింపు తర్వాత విన్నర్ కు ప్రైజ్ మనీ లభిస్తుంది. బహుమతి గెలుచుకున్న టికెట్ డ్రా డేట్ నుంచి  90 రోజులలోపు సంబంధిత అధికారులకు సమర్పించాలి. 90 రోజుల తర్వాత టికెట్ చెల్లనిదిగా పరిగణిస్తారు.

కేరళ సర్కారు ఆధ్వర్యంలో లాటరీ టికెట్ల అమ్మకం

కేరళ ప్రభుత్వం వారంలో ప్రతిరోజు డ్రా చేసుకునే లాటరీ టిక్కెట్లను కూడా అందిస్తున్నది. అంతేకాదు, 6 బంపర్ లాటరీలు కూడా అమ్ముతుంది. వీటికి ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. సోమవారం అక్షయ, మంగళవారం కారుణ్య, బుధవారం కారుణ్య ప్లస్, గురువారం నిర్మల్, శుక్రవారం స్త్రీశక్తి, శనివారం విన్‌ విన్, ఆదివారం ఫిఫ్టీ ఫిఫ్టీ పేరుతో రోజువారీ టిక్కెట్లను కూడా విక్రయిస్తుంది. వీటితో పాటు బంపర్ టిక్కెట్లు కూడా అమ్ముతున్నది. మాన్‌ సూన్ బంపర్, పూజా బంపర్, సమ్మర్ బంపర్, తిరువోణం బంపర్, విషు బంపర్, క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాంటి టికెట్లను కూడా అమ్ముతున్నది. వీటికి పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ అందిస్తారు. ఈ లాటరీ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును కేరళ ప్రభుత్వం సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నది.

Read Also: బిచ్చగాళ్లకు దానం చేస్తున్నారా? జాగ్రత్త, భారీ ఫైన్ తప్పదు.. జనవరి నుంచే అమలు!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×