Student Suspended: మన చిన్నప్పుడు ఎట్లుండేది.. స్కూల్‌లో అడుగుపెట్టగానే.. ఎదురుగా సార్ కనిపిస్తే.. భయంతో వణికేవాళ్లం. బయట ఎక్కడైనా కనిపిస్తే.. నమస్తే సార్ అని భయం భయంగా పలకరించేవాళ్లం. అంత గౌరవం ఉండేది ఉపాద్యాయులు అంటే.. కానీ ఇప్పుడు పాఠాలు చెప్పే టీచర్లు అంటే విద్యార్ధులకు లెక్కే లేదు. ఇంకా సార్లే స్టూడెంట్స్‌కి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పుసుక్కున చిన్నమాట అంటే.. లెక్చరర్లపై తిరగబడుతున్నారు.
పిల్లలు చదువుకొని బాగుపడతారని కాలేజీలకు పంపిస్తే.. కొందరు విద్యార్ధులు చదువును పక్కన పెట్టి.. సెల్ ఫోన్లతో మంచిగా టైమ్ పాస్ చేస్తున్నారు. ఏమన్నా అంటే.. లెక్చరర్లపై తిరగబడుతున్నారు. కాలేజీలో ఫోన్ వాడొద్దు అన్నందుకు.. టీచర్‌పై చెప్పుతో కొట్టడానికి రెడీ అయింది. పెద్ద లేదు చిన్న లేదు. టీచర్ అన్న మర్యాద, భయము, భక్తి ఏం లేదు.. నా ఫోన్ ఎట్లా తీసుకుంటావు.. నువు లెక్చరర్ అయితే ఎవరికి గొప్ప అని బండ భూతులు తిడుతూ.. కాలేజీలో అందరి ముందు చెప్పు తీసుకుని లెక్చరర్‌ను ఫట్ ఫట్ మని కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఈ ఘటన..
అసలేం జరిగిందంటే.. కాలేజీ రూల్స్ ప్రకారం స్టూడెంట్స్ దగ్గర ఫోన్లు ఉండొద్దట. అయితే ఇంజనీరింగే సెకండియర్ చదువుతున్న ఈ అమ్మాయి కాలేజీకి ఫోన్ తీసుకొచ్చి ముచ్చట్లు పెడుతుంది. అది చూసి మేడమ్ ఫోన్ లాక్కుంది. ఇక అంతే.. నా ఫోన్ ఇస్తావా. ఇయ్యవా అని పూనకం వచ్చినట్లు ఊగిపోయి లెక్చరర్‌ను బూతులు తిట్టుకుంటా చెప్పుతోను కొట్టింది. అక్కడున్న ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక స్టూడెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది మస్తు వైరల్ అయింది. చదువుకునే పిల్లలు సైకోలెక్క తయ్యారు ఏంది. మరి ఇంత ఘోరమా అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్‌ను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది యాజమాన్యం. నేటి సాంకేతిక యుగంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ.. సెల్ వలయంలో చిక్కకుపోతున్నారు. ఫోన్ అందరిని కట్టుబానిసలుగా మార్చుకుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి.. రాత్రి పడుకునే ముందు తనపై ఆధారపడేలా మలుచుకుంది. యువతీ, యువకులు, విద్యార్ధులైతే అరచేతిలో పెట్టుకుని పొద్దస్తమానం కాలక్షేపం చేస్తున్నారు. గంటల కొద్ది చాటింగ్ చేస్తూ.. సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు.
Also Read: 28 ఏళ్లకే రిటైర్మెంట్.. కంపెనీ స్థాపించి రూ.119 కోట్లకు విక్రయించిన నర్సు
ఈ మధ్య కాలంలో పిల్లలు, యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాలకు బానిసలవుతున్నారు. అధికం సమయం.. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారని.. నిపుణులు ఆందోళ చెందుతున్నారు. దీనివల్ల పిల్లల జ్ఞాపక శక్తి, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడం వంటి పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని నిపుణులు తెలిపారు. ఈ తరుణంలో ఎనిమిది ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
రఘు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్ గురుగుబెల్లి వెంకట లక్ష్మీని కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం.#AndhraPradesh #Visakhapatnam #Vizag #VizagNews #TeluguNews pic.twitter.com/FerHZphxiv
— Vizag News Man (@VizagNewsman) April 25, 2025