BigTV English
Advertisement

Lion Attack : సింహంతో టిక్‌టాక్ పరాచికాలు.. చాచి పంజాతో కొడితే కానీ తెలియలేదు వాస్తవాలు..

Lion Attack : సింహంతో టిక్‌టాక్ పరాచికాలు.. చాచి పంజాతో కొడితే కానీ తెలియలేదు వాస్తవాలు..

Lion Attack : సింహాన్ని దూరంగా నిలుచుని సెల్ఫీ దిగు తప్పులేదు.. చనువిచ్చింది కదా అని ఆడుకోవాలని చూశావో.. అంటూ ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇది సినిమాలో డైలాగే కాదు.. నిజం కూడా. మనకి సరదాగా ఉంటే.. దూరంగా ఉంది ఫోటో తీసుకోవాలి, లేదా.. బోనులో ఉంటే కాస్త దగ్గరగా వెళ్లినా ఫర్వాలేదు. కానీ.. ఏకంగా బోనులోకి వెళ్లి టిక్ టాక్ వీడియో తీసుకున్నాడో యువకుడి. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.. మనోడు ఊహించంది, కాస్త బుర్ర ఉన్నవాళ్లుకు తెలిసిందే.. అయ్యింది. రావయ్యా బాబు అంటూ స్వాగతం చెప్పి.. తనదైన శైలిలో సత్కారం చేసింది ఆ సింహం… ఇంతకీ ఏమైంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా…


మన పక్కదేశం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన యువకుడు ముహమ్మద్‌ అజీమ్‌.. టిక్ టాక్ మోజులో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇటీవల లాహోర్ లోని ఓ లయన్ బ్రీడింగ్ ఫామ్ కి వెళ్లాడు. మనోడికి అసలికే.. టిక్ టాక్ పిచ్చి. ఎక్కడ కాస్త సమయం దొరికినా వీడియోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటాడు. అలాంటి వాడు.. సింహాన్ని చూసే వరకు ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. దానితో సరదాగా ఓ టిక్ టాక్ వీడియో తీసుకుంటే.. మస్త్ ఫేమస్ అవ్వొచ్చని కేరింతలు కొట్టాడు.

ముందు వెనుక ఆలోచించకుండా.. బోను దగ్గరకు వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న ఇన్ స్ట్రక్టర్ కి చెప్పాపెట్టకుండా.. నేరుగా బోనులోకి వెళ్లిపోయాడు. మనోడి చర్యతో అక్కడ ఉన్న వాళ్లందరికీ భయం పుట్టుకొచ్చింది. అదేంటి నాయనా.. అది పిల్లి అనుకున్నావా… పులి అనుకున్నావా అని కేకలు పెట్టేశారు. అయినా.. టిక్ టాక్ మత్తులో ధైర్యంగా వెళ్లి, వీడియో మొదలు పెట్టాడు. బోనులోకి వచ్చిన వ్యక్తిని చూసిన పులి.. కాస్త భయం కూడా లేకపోతే ఎలాగరా అబ్బాయ్ అనుకుందో ఏమో.. మన తెలుగు సినిమాలోని డైలాగ్ లాగే.. తన ఇగో హర్ట్ అయ్యిందో కానీ.. పంజాకు పని చెప్పింది. ముహమ్మద్‌ అజీమ్‌ పై దాడి చేసింది. అప్పటికి కానీ తత్వం బోధపడలేదు. సింహం గర్జన, దాని పంజా దెబ్బకు.. దేవుడు కనిపించాడు. కాపాడండిరా బాబోయ్ అంటూ కేకలు అందుకున్నాడు. దాంతో.. పరుగుపరుగునా వచ్చిన సిబ్బంది.. సింహాన్ని తరిమికొట్టి బాధితుడిని కాపాడారు.


ముఖం, గొంతు, వీపు భాగాల్లో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పంజా గోర్లు బలంగా దిగడంతో.. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు బ్రీడింగ్ ఫామ్ సిబ్బంది. వెంటనే వైద్య సాయం అందించిన వైద్యులు.. అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా కొన్ని రోజులు అయితే కానీ కోలుకుంటాడో లేదో చెప్పలేమని అంటున్నారు. ఈ ఘటనపై అక్కడ ప్రభుత్వ మంత్రి స్పందించారు. యువకుడు సింహం దగ్గరకు వెళ్లే వరకు బ్లీడింగ్ ఫామ్ యజమాని ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ప్రభుత్వం.. సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : పుణ్య స్నానాలకు వచ్చి.. బ్యూటీల వెంట పడతారేంట్రా బాబు, చివరికి ఆమె…

అదే విధంగా.. ఆ యువకుడి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్కడికి వెళ్లాం, ఏం చేసేందుకు వెళ్లాం అనే విషయాన్ని పక్కన పెట్టి… వీడియోలు, ఫోటోలతో ప్రపంచాన్ని మరిచిపోతే ఇలాంటి పరిస్థితే వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. వీడియోలు.. సంతోషించేందుకే కానీ, మన ప్రాణాల్ని ఫణంగా పెట్టి వీడియోలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు.

Related News

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Viral News: 3 నెలలు ఆఫీస్ కు వెళ్లకున్నా పట్టించుకోలేదట, వామ్మో ఇలా కూడా ఉంటారా?

Farmers Debt Clears: తల్లికి నిజమైన నివాళి.. 290 మంది రైతుల అప్పులు తీర్చేసిన వ్యాపారి

Tirumala Tallest Woman: ఏయ్ బాబోయ్‌ ఎంత పొడుగో.. తిరుమలలో ఎత్తైన మహిళ సందడి

Viral Video: రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టిన బైకర్, నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Big Stories

×