IT Rides on Dilraju House :ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రామ్ చరణ్ (Ram charan) ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dilraju) నిర్మించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు దిల్ రాజు పని అయిపోయిందని భావించిన వారందరికీ ఈ సినిమా ఫలితాలు దిల్ రాజును మళ్లీ నిలబెట్టాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాల ఫలితాలు చూసి సంతోషపడేలోపే, ఆయన ఇల్లు ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులను నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న నివాసాలలో కూడా సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వాములు ఇళ్లల్లో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు..
ముఖ్యంగా శిరీష్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇళ్లల్లో, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సినీ ఫైనాన్స్ సంస్థలపై కూడా ఐటీ దాడులు జరుగుతూ ఉండగా సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్ లో కూడా తాజాగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే నిర్మాత అభిషేక అగర్వాల్ ఆఫీస్ లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ కొండాపూర్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టుబడులు ఆదాయం పైన ఆరా తీస్తున్నారు. కాగా, దిల్ రాజు భార్యను ఐటీ అధికారులు ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు కి తీసుకెళ్లారు ఐటి అధికారులు.బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటి అధికారులు దిల్ రాజు భార్య తేజస్వినిని తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం నుంచే ఐటి శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.. ముఖ్యంగా సినిమా రిలేటెడ్ లో భాగంగానే సోదాలు చేస్తున్నారని ఐటీ సోదాలు జనరల్గా జరిగే సోదాలు లాగే నిర్వహిస్తున్నారని సమాచారం. ఇకపోతే ఐటీ శాఖ అధికారులు బ్యాంకు డీటెయిల్స్ కావాలని అడగడం వల్లే బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించామని తెలిపినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు నిర్మించిన సినిమాలు..
ముఖ్యంగా ఈ సంక్రాంతికి దిల్ రాజు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా డిజాస్టర్ గా నిలిచింది. కానీ కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చినట్లు పోస్టర్తో సహా రివీల్ చేశారు మేకర్స్. మరొకవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా అప్పుడే రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయిందని మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.