Shoji Morimoto: డబ్బులు రావాలంటే ఒళ్లు వంచి పని చేయాలి. ఉద్యోగానికి వెళ్లాలి. లేదంటే, వ్యాపారం చేయాలి. అప్పుడే కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ చేయకుండానే డబ్బులు వస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి ఏమీ చేయకుండానే ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నాడు. భలే ఉందే! ఇంతకీ తనకు డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే!
ఏమీ చేయకుండా డబ్బులు సంపాదిస్తున్న ఆ వ్యక్తి పేరు షోజి మొరిమొటో. వయసు 40 ఏండ్లు. ఇతడు రెంటల్ –డు- నథింగ్ అనే వ్యాపారాన్నిమొదలు పెట్టాడు. వ్యాపారం అంటే ఏదో కష్టపడి పని చేసేది కాదు. ఈ బిజినెస్ లో ఆయన ఏం చేస్తారంటే? అతడిని ఎవరైనా రెంట్ కు తీసుకోవచ్చు. అంటే, ఏదో పిచ్చి పనులు చేయడానికి కాదు. తనను బుక్ చేసుకున్న వారితో ఎలాంటి శారీరక సంబంధాన్ని పెట్టుకోడు. కేవలం అతడి సమయాన్ని మాత్రమే క్లయింట్ కోసం కేటాయిస్తాడు.
ఉద్యోగం పోవడంతో సరికొత్త ఆలోచన
మొరిమొటో 2018 వరకు ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత అనుకోకుండా తను ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పుడే తనకు ఓ క్రేజీ ఆలోచన వచ్చింది. రెంటల్ –డు- నథింగ్ ఈ సర్వీస్ ను ప్రారంభించాడు. ఈ కాన్సెప్ట్ జపాన్ ప్రజలకు భలే అనిపించింది. మొరిమొటోను బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా తనను బుక్ చేసుకున్న క్లయింట్ దగ్గరికి వెళ్తాడు. వారితో సరదాగా మాట్లాడుతాడు. వారి వెంట పనులకు వెళ్తాడు. కానీ, ఆయన పని చేయడు. వాళ్లు చేస్తుంటే, తను కంపెనీ ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే, వారికి తోడుగా వెళ్తాడు. వారికి కంపెనీ ఇస్తాడు. తనను బుక్ చేసుకున్న వారు ఇంట్లో పనులు చేసుకుంటే, వారి ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తాడు. తనను బుక్ చేసుకున్న వారు క్యూలో నిలబడాల్సి వస్తే, వారికి బదులుగా తను నిలబడుతాడు. ఒంటరిగా ఫీలయ్యే వారితో హ్యాపీగా మాట్లాడుతాడు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయన గత ఏడాది ఏకంగా 80 వేల డాలర్లు సంపాదించడాట. భారత కరెన్సీలో ఆ విలువ రూ.69 లక్షలు కావడం విశేషం.
Read Also: గర్భవతి అని తెలిసిన 4 గంటల్లోనే బిడ్డకు జననం, అలా ఎలా?
ఏడాదికి 1000కి పైగా బుకింగ్స్
మొరిమొటోకు గతంతో పోల్చితే ఇప్పుడు మరిన్ని బుకింగ్స్ వస్తున్నాయట. ఏడాది సుమారు 1000 మంది దాకా ఆయనను బుక్ చేసుకుంటారట. కొంత మంది కొన్ని గంటల పాటు బుక్ చేసుకుంటే, మరికొంత మంది వారి అవసరాన్ని బట్టి కొన్ని రోజుల వరకు బుక్ చేసుకుంటారట. గతంలో 2 నుంచి 3 గంటలు బుక్ చేసుకున్న వారికి 60 నుంచి 90 డాలర్ల వరకు వసూళు చేసేవాడు. కానీ, ఇప్పుడు ఇంత ఇవ్వాలని అడగడం లేదట. కస్టమర్లకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత తీసుకుంటున్నాడట. మొరిమొటోను ఆదర్శంగా తీసుకుని.. ఇలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టడం విశేషం.
Read Also:పంచదార శాకాహారమా? మాంసాహారమా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!