Man Marries Daughter In Law| మనిషి సామాజిక జీవి. సమాజం కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలి లేకపోతే ఇదే సమాజం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది, చివరికి బహిష్కరణకు గురి కావాల్సి ఉంటుంది. అయితే సమాజం గురించి పట్టించుకోకుండా ఒక యువతిని తన భర్త తండ్రిని వివాహం చేసుకుంది. అయితే వివాహం వెనుక ఆమె పడిన తీవ్ర ఇబ్బందులున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఛాపియా ఉమరావ్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ అనే 70 ఏళ్ల వ్యక్తి తన మూడో కుమారుడి భార్య పూజాను వివాహం చేసుకున్నాడు. ఇది రహస్యంగా జరిగిన వివాహం. ఈ విషయం వారిద్దరూ చాలా కాలం దాచి ఉంచారు. తాజాగా వెలుగులోకి రావడంతో ఆ గ్రామస్తులు, వారి బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విషయం పోలీసుల దాకా వెళ్లే సరికి.. వారు తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని.. అందుకే చర్యలు తీసుకోలేదని చెప్పారు.
నిజానికి కైలాశ్ ఒక వాచ్ మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. అతనికి ముగ్గురు కొడుకులు. వారిలో మూడో కొడుకు రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే అప్పటికే అతనికి పూజా అనే యువతితో వివాహం జరిగింది. ఇంట్లో ఒంటరిగా తిరుగుతున్న తన కోడలి బాధను చూసి కైలాశ్ ఆమెకు రెండో వివాహం చేయాలని నిర్ణయించాడు. అందుకే తనకు తెలిసిన ఒక యువకుడితో పూజాకు రెండో పెళ్లి చేసి సాగనంపాడు.
కానీ పూజా ఆ రెండో భర్త ఇంట్లో నరకం అనుభవించింది. అక్కడ ఆమెకు రెండో భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టేవారు. దీంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. ఆ తరువాత రెండో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇదంతా చూసి కైలాశ్ తన వల్లే పూజ జీవితం ఇలా అయిందని భావించాడు. అందుకే ఆమెకు మూడో వివాహం చేస్తానని అయితే ఈసారి ఆమె కోరుకున్న వరుడితో చేస్తానని చెప్పాడు. దీని పూజా తన మామ ఒంటరి తనం గురించి ఆలోచించి ఇక తాను పరాయి వాళ్లను నమ్మలేనని.. అందుకు ఆయన వద్దే ఉంటానని చెప్పింది. అలా మామతోనే ఉంటూ ఆయను సేవలు చేస్తూ ఉండగా.. ఒంటరితనంతో బాధపడే ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరి పట్ల మరొకరి ప్రేమ భావాలు కలిగి చివరికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read: పొలంలో సూట్ కేసు.. అందులో శవం.. భర్త మేనల్లుడిని ప్రేమించిన యువతి
అందుకే మరో గ్రామానికి వెళ్లి అక్కడ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వివాహం గురించి తెలిసి కైలాశ్ మిగతా కొడుకులు గొడవ చేయడంతో విషయం అందరికీ తెలిసిపోయింది. ఇద్దరి మధ్య 42 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని ఎత్తి చూపుతూ వావి వరుసలు మరిచి చేసుకున్న వివాహం చెల్లుబాటు కాదని ఇప్పుడు ఈ విషయం గ్రామ పంచాయితీ వరకు వెళ్లింది.
గుజరాత్ లో కోడలికి రెండు వివాహం చేసిన అత్తమామలు
గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా కుమారుడు సిద్ధరాజ్ 2024 దీపావళి సమయంలో గుండెపోటుతో మరణించాడు. దీంతో అతని భార్య కృష్ణ, నెలల వయసున్న పసిపాప దీక్షిత అనాథలయ్యారు. అది చూసి ప్రవీణ్ సింగ్ తన కోడలు కృష్ణను కూతురిలా భావించాడు. అందుకే ఆమెకు రెండో వివాహం చేయాలని నిర్ణయించి.. చనిపోయిన తన కొడుకు స్నేహితుడైన సంజయ్ తో ఈ విషయం చెప్పాడు. సంజయ్ అందుకు అంగీకరించడంతో తన కోడలు కృష్ణ, సంజయ్ లకు ఘనంగా వివాహం జరిపించాడు. కోడలు, మనవరాలిని సాగనంపుతూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు సంజయ్ కూడా కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ భావోద్వేగ భరితైమన కథ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ మారింది. ప్రవీణ్ పై నెటిజెన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.