BigTV English

Wife Affair With Nephew: పొలంలో సూట్ కేసు.. అందులో శవం.. భర్త మేనల్లుడిని ప్రేమించిన యువతి..

Wife Affair With Nephew: పొలంలో సూట్ కేసు.. అందులో శవం.. భర్త మేనల్లుడిని ప్రేమించిన యువతి..

Wife Affair With Nephew| ఒక రైతుకు తన పొలంలో ఒక సూట్ కేసు లభించింది. ఆ సూట్ కేసులో ఒక పురుషుడి శవం నడుము భాగం లభించింది. ఇది చూసి ఆ రైతు భయపడిపోయాడు. ఆ తరువాత కొంత దూరంలో ఒక గోనె సంచి లభించింది. అందులో శవం కాళ్లు, చేతులు కనిపించాయి. దీంతో ఆ రైతు ఇరుగు పొరుగు వారిని పిలిచి విషయం తెలియజేశాడు. ఆ తరువాత పోలీసులు దీని గురించి తెలుసుకొని విచారణ చేయగా.. అనుకోకుండా ఆ హత్యలో ఒక వివాహేతర సంబంధం బయపడింది. దాని కారణంగానే ఒక యువకుడు దారుణ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్ అనే 38 ఏళ్ల యువకుడికి ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నౌషాద్ భార్య సల్మా అందగత్తె. దీంతో భార్యను నౌషాద్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారికి వివాహం జరిగిన రెండేళ్ల తరువాత ఒక కూతరు కూడా పుట్టింది. ఈ క్రమంలో అయితే నాలుగేళ్ల క్రితం నౌషాద్ మేనల్లుడు ఇర్ఫాన్ (19) ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. ఏసీ మెకానిక్ అయిన నౌషాద్ తన మేనల్లుడిని చేరదీసి తన ఇంట్లోనే ఉండనిచ్చాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ కు తన మేనమామ భార్య సల్మాతో పరిచయం ఏర్పడింది. కానీ సల్మా క్రమంగా ఇర్ఫాన్ పై మనుసు పడింది. క్రమంగా ఇర్ఫాన్ కూడా సల్మాకు దెగ్గరయ్యాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. కానీ వారి గురించి అనుకోకుండా ఒక రోజు నౌషాద్ కు తెలిసి పోయింది. దీంతో నౌషాద్ భార్య, తన మేనల్లుడు ఇర్ఫాన్ ని చితకబాదాడు. ఆ తరువాత తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ విషయం గ్రామ పంచాయితీ వరకు వెళ్లింది. చివరకు తన కూతురి కోసం నౌషాద్ వెనుకడుగు వేశాడు. తన భార్య సల్మాను క్షమించి మరో అవకాశం ఇచ్చాడు.

2022లో నౌషాద్ కు దుబాయ్ లో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. భారీ వేతనం ఉండడంతో నౌషాద్ దుబాయ్ వెళ్లిపోయాడు. అదే అతను చేసిన తప్పు. ఎందుకంటే నౌషాద్ వెళ్లిపోయాక సల్మా మళ్లీ అతని మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కానీ ఏడాదికోసారి నౌషాద్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2025న నౌషాద్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. కొన్ని రోజుల క్రితం నౌషాద్ ఇంట్లో నిద్రపోతూ ఉండగా.. తనకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని సల్మా ప్లాన్ వేసింది. అందుకే తన ప్రియుడు ఇర్ఫాన్ తో కలిసి.. ఇంట్లో నిద్రపోతున్న నౌషాద్ ను ఒక రోకలి బండ, ఒక గొడ్డలి ఉపయోగించి దారుణంగా చంపారు. ఆ తరువాత అతని శరీర భాగాలను విడి విడిగా సంచుల్లో నింపారు. కానీ అవి సరోపోక పోవడంతో దుబాయ్ నుంచి నౌషాద్ తీసుకొచ్చిన లగేజ్ సూట్ కేసులో అతని నడుం భాగాన్ని దాచి ఆ సంచులు, సూట్ కేసులను ఊరి చివర ఉన్న పొలాల్లో పడేసారు.


Also Read: 42 ఏళ్లుగా గల్ఫ్‌ దేశంలో చిక్కుకున్న కొడుకు.. 90 ఏళ్ల తల్లి నిరీక్షణ ఫలించేనా?

ఆ తరువాత ఒక రైతుకు శవ భాగాలు సూట్ కేసులో లభించడంతో పోలీసులు హత్య కేసుగా పరిగణించి విచారణ చేపట్టారు. తొలుత ఈ కేసులో పోలీసులకు ఎటువంటి క్లూ లభించలేదు. కానీ ఆ సూట్ కేసుకు ఎయిర్ పోర్టు సిబ్బంది తగిలించే ఎయిర్ ట్యాగ్ ఉండిపోయింది. దాని ఆధారంగా పోలీసులు ఎయిర్ పోర్టులో ఆ ఎయిర్ ట్యాగ్ బార్ కోడ్ ని స్కాన్ చేసి అది నౌషాద్ సూట్ కేసు అని కనిపెట్టారు. అలా నౌషాద్ కోసం వెతుకుతూ అతని ఇంటికి చేరుకోగా అక్కడ అతని తండ్రి, కూతురు కనిపించారు. అతని భార్య సల్మా పుట్టింటికి వెళ్లిందని తెలుసుకున్నారు. చివరికి పోలీసులు సల్మా అక్రమ సంబంధం గురించి తెలుసుకొని ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆమె హత్య చేసినట్లు అంగీకరించింది. ఆ తరువాత పోలీసులు ఇటీవలే పరారీలో ఉన్న ఆమె ప్రియుడు, నౌషాద్ మేనల్లుడు ఇర్ఫాన్ ని కూడా పట్టుకున్నారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×