Snake Video Viral: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచం నలుమూలలా ఏం జరిగిన ఈజీగా తెలిసిపోతుంది. క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అలాగే వేల కొద్ది లైకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ వీడియోలను ఎక్కువగా చూస్తుంటారు. వర్షాకాలం రావడంతో పాములు వీడియో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పాములు బయట ఎక్కువగా సంచరిస్తున్నాయి. పాములు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కనిపిస్తాయో మనం ఊహించలేం. సడెన్ గా పాములు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు బైకులు, మంచాల కింద, బట్టల పైన, బూట్ లోపల, ఇంటిపైన పాములు కనబడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతుండగా.. వెనుక భారీ పాము వేలాడుతూ వీడియో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓ వ్యక్తి మామూలుగా సైకిల్ పై వెళ్తున్నాడు. సాధారణంగా సైకిల్ తొక్కేవారు వెనుకాలా ఏం జరుగుతుందో తెలుసుకోలేరు. వారి ఫోకస్ అంతా ముందే ఉంటుంది. అయితే సైకిల్ వెనుక క్యారెల్ పై ఓ భారీ పాము వేలాడుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. సైకిల్ క్యారెల్ పైన ఎక్కిన పెద్ద పాము.. వేగంగా అటు ఇటు కదులుతున్నట్టు వీడియోలో తెలుస్తుంది. వెనుక పాము ఉందని తెలియని ఆ వ్యక్తి.. జాలీగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు.
?utm_source=ig_web_copy_link
అయితే, వెనుక వెళ్తున్న వారు ఆ పామును షాక్ కి గురయ్యారు. ఆ పాము ఎక్కడ అతనికి హానీ చేస్తుందోనని భయానికి లోనయ్యారు. అయితే ఆ పాము ఫాస్టుగా సైకిల్ పై నుంచి కిందకు దిగింది. ఆ పక్కనే ఉన్న గడ్డిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది ఈ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో వీడియో వైరల్ గా మారింది.
ALSO READ: Watch Video: ఐఏఎస్ ఆఫీసరై ఉండి.. స్టూడెంట్‌తో దారుణ ప్రవర్తన, వీడియో వైరల్
సంబంధించి పాము వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా మంది నెటిజన్లు షేర్, లైక్ లు చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. ‘వారెవ్వా.. ఈ పాము గ్రేట్, సైకిల్ రైడ్ ఎంజాయ్ చేస్తుంది అని ఒకతను కామెంట్ చేశాడు. మరొకరు ‘ఇతని టైం బాగుంది.. పాము కాటేయకుండా వదిలేసింది’ అని కామెంట్ చేశాడు. ‘ఈ పాముకు జెర్రిపోతు అని దానికి విషం ఉండదు అని’ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వీడియో మొత్తం 20.5 మిలియన్ల వ్యూస్ రాగా.. లక్షకు పైగా లైకులు వచ్చాయి.
ALSO READ: Job Updates: 1340 జేఈ ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం నీదే భయ్యా