BigTV English

Humanity Viral 2025: రూ. 20 లకే బంగారు మంగళసూత్రం.. అందరికీ కాదు.. కేవలం వారికే!

Humanity Viral 2025: రూ. 20 లకే బంగారు మంగళసూత్రం.. అందరికీ కాదు.. కేవలం వారికే!

Humanity Viral 2025: ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే మనుషులు గొడవపడుతున్నారు. ఎవరి మనసులో వాళ్ళే… ఎవరి బాధ ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఒక చిన్న జ్యూవెలరీ షాప్‌లో జరిగిన ఈ సంఘటన, మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చెబుతుంది. మామూలుగా వినడానికి చిన్న సంఘటనలా కనిపించొచ్చు. కానీ ఇది ఎన్ని హృదయాలను తాకిందో.. ఎంత మంది జీవితాలకు స్పూర్తి అయిందో చెప్పలేం. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో గోపికా జ్యువెలర్స్ అనే ఆభరణాల షాప్‌లో ఈ సంఘటన జరిగింది.


వృద్ధ దంపతుల ప్రేమకు నిదర్శనం
వయస్సు 93. కానీ ప్రేమలో మాత్రం కొత్త జంటలా కనిపించారు. చేయి చేయి కలిపుకుని, నడుచుకుంటూ ఆ షాప్‌లోకి ప్రవేశించారు ఒక వృద్ధ దంపతులు. వాళ్లకి చాలా రోజులుగా ఒక మంగళసూత్రం కొనాలనే ఆలోచన ఉంది. ఎంతో అంకితభావంతో, ఎంతో ఆత్మీయంగా నెక్లెస్‌లు చూసుకుంటూ చివరకు ఒక మోడల్ ఎంచుకున్నారు. ఈ జంటను చూస్తే, ఒక్కసారి గుండె నిగ్రహించలేం.. వాళ్ల మధ్య ఆ ప్రేమ, గౌరవం కన్నులకు కనిపించింది.

ఇంత డబ్బా? అని నవ్విన షాపు యజమాని
వృద్ధ మహిళ తన చీరలో కట్టిన మడతల నుండి రూ.1120 తీసి పెట్టింది. అది చూసిన షాపు యజమాని, “ఇంత డబ్బా?” అని నవ్వాడు. ఆమె కొంచెం తడబడి చూసేలోపే, పెద్దవాడు తన జోల పెట్టి నాణేలతో నిండిన రెండు ప్యాకెట్లను తీసి పెట్టాడు. అది చూసిన షాపు యజమాని ముఖంలో సీరియస్ ఎక్స్‌ప్రెషన్.. కానీ వెంటనే నవ్వుతూ, వారితో హృదయపూర్వకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడే అసలు మజా మొదలైంది.


రూ.1120 తీసుకోలేదంటే నమ్ముతారా?
ఆ వృద్ధుల కష్టాన్ని చూసిన షాపు యజమాని కరిగిపోయాడు. మీ ప్రేమకే ఓ నివాళిగా… మీరు మంగళసూత్రం తీసుకెళ్లండి, నాకు మాత్రం రూ.20.. అవునండి, కేవలం ఇరవై రూపాయలే ఇవ్వండి అన్నాడు. వాళ్లు ఆశ్చర్యపోయారు, కళ్ళల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఎప్పుడైనా వాళ్ల జీవితంలో ఇలాంటి ఆదరణ చూసారా? అంటే అది ఇదే మొదటిసారి అయ్యుండచ్చు. వారి మధ్య ప్రేమ చూసి ఎంతగానో కరగిపోయిన షాపు యజమాని నిజంగా ఒక దేవుడిగా నిలిచాడు.

కన్నీటి వెనుక ఉన్న విషాదకథ
వారు ఇద్దరూ ఒంటరిగా జీవిస్తున్నారు. పెద్ద కొడుకు అనారోగ్యంతో మరణించాడు. చిన్న కొడుకు మద్యానికి బానిసైపోయాడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్లు ఇద్దరూ ఒకరినొకరు దైర్యంగా నిలబెట్టారు. ఏ ఇంట్లో చూసినా ఇలాంటి ప్రేమ కనపడటం చాలా అరుదు. వాళ్ల ప్రేమను చూసి అక్కడే ఉన్న వాళ్లంతా హృదయపూర్వకంగా కరగిపోయారు.

Also Read: AP Airport Projects: కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌లో రయ్ రయ్! రూ. 8 కోట్లతో కొత్త రూపు!

సోషల్ మీడియాలో సంచలనం
ఈ సంఘటనను వీడియో తీసిన వ్యక్తి Twitter/Xలో @singhvarun పేరుతో పోస్ట్ చేశాడు. ఇది నా రోజును మార్చిందన్న క్యాప్షన్‌తో పెట్టిన ఆ వీడియో ఇప్పటి వరకు లక్షకు పైగా వీక్షణలు సంపాదించింది. ప్రపంచం మొత్తం ఈ వృద్ధ జంటను చూసి ఎమోషనల్ అయింది. నాకు భాష అర్థం కాలేదు కానీ భావోద్వేగం అర్థమైంది అంటూ ఓ విదేశీ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇంకొకరు చూస్తూనే నా కన్నీళ్లు ఆగలేదు అన్నారు.

మానవత్వం బ్రతికే ఉంది!
ఈ సంఘటన మనకు గుర్తు చేస్తోంది.. డబ్బు అనేది అంతంత మాత్రమే. ప్రేమ, గౌరవం, మానవత్వం అనే విలువలు అందరికీ అవసరం. షాపు యజమాని చూపిన ఉదారత, వృద్ధుల మధ్య ఉన్న అనుబంధం.. ఇవి మనకు ఎంతో స్పూర్తినిచ్చే విషయాలు. ఈరోజుల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్, అసహనాలు ఎక్కువైపోయాయి. కానీ ఇలాంటి వీడియోలు చూస్తే.. మనసు ఒక్క క్షణం ఆగి మృదువవుతుంది.

వృద్ధ జంటకు ఇచ్చిన ఆ మంగళసూత్రం వాళ్ల ప్రేమకు గుర్తుగా మారింది. వృద్ధుల ఆశలు తీరినప్పుడే కాదు.. మనలాంటి వాళ్ల హృదయాలను తాకినప్పుడే ఈ సంఘటన ప్రత్యేకమవుతుంది. ప్రేమకు, మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచిన ఈ సంఘటనను ప్రతి ఒక్కరు తప్పక చూసి, గుండెతో అర్థం చేసుకోవాలి.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×