AP News : పెళ్లంటే నూరేళ్ల పంట. భార్యాభర్తలంటే లైఫ్ లాంగ్ తోడుంటే బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే ఏరికోరి ఎంచుకుంటారు లైఫ్ పార్ట్‌నర్‌ని. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే.. చాలామంది తల్లిదండ్రులు చూసిన చక్కని సంబంధాన్ని ఒప్పేసుకుంటారు. బాగా సంపాదించే, మంచి గుణాలుండే మగాడు భర్తగా రావాలని అమ్మాయిలంతా కోరుకుంటారు. ఈడూజోడూ చూడ ముచ్చటగా ఉండాల్సిందే. మనసు మెచ్చిన వాడి ముందే.. మెడలు వంచి తాళి కట్టించుకుంటారు. పెళ్లి అయ్యాక ఎలాగూ ప్రాబ్లమ్స్ వస్తాయనుకోండి అది వేరే విషయం. తర్వాత ఏమవుతుంది అనే దానితో సంబంధం లేకుండా.. పెళ్లికి మాత్రం తగిన వరుడినే సెలెక్ట్ చేసుకుంటారు నేటితరం యువతులు. అబ్బాయిలకు అన్ని ఆప్షన్స్ ఉండవనుకోండి. పిల్ల దొరకడమే కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఇక అసలు మేటర్ ఏంటంటే…
గుళ్లో పెళ్లి.. కానీ…..
అది కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం. ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. పురోహితుడు పెళ్లి తంతు నిర్వహిస్తున్నాడు. పెద్దలంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పీటలపై వధువు, వరుడు ఆసీనులయ్యారు. కాసేపట్లో తాళి కట్టే శుభముహూర్తం. కట్ చేస్తే……
పెళ్లి కూతురు ఏడుపు…
పీటలపై కూర్చు్న్న పెళ్లి కూతురు కన్నీరు పెట్టడం ప్రారంభించింది. బోరున ఏడుస్తోంది. పెళ్లి కదా.. ఏదో ఎగ్జైట్‌మెంట్ అనుకున్నారు మొదట. కానీ, ఆ వధువు ఏడుపు ఆగట్లేదు. కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, గుడికి వచ్చిన భక్తులు ఆమె ఏడుపును పసిగట్టారు. ఇదేదో బలవంతపు పెళ్లి అని అనుకున్నారు. వెంటనే మండపానికి వచ్చి ఇదేంటని నిలదీశారు. పెళ్లి కూతురు ఎందుకు ఏడుస్తోందని ప్రశ్నించారు. ఆమెను చూసి ఇది మైనర్ మ్యారేజ్ అనుకున్నారు. కానీ, ఆమె మేజరేనని వయస్సు 22 ఏళ్లని తెలిసింది. మరి, అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? పెళ్లి ఇష్టం లేదా? ఇంట్లో వాళ్లు బలవంతంగా చేస్తున్నారా? అని భక్తులు గట్టిగా అడిగే సరికి అసలు విషయం తెలిసింది. ఔరా అని అవాక్కయ్యారు అక్కడి వాళ్లందరూ.
22 వెడ్స్ 42.. ఇది న్యాయమా?
భక్తుల సపోర్ట్‌తో పెళ్లి కూతురు అసలు విషయం చెప్పేసింది. తనకు 22 ఏళ్లు అని.. కానీ, పెళ్లి కొడుకు ఏజ్ 42 అని చెప్పింది. తమ మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉందని.. తాను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని బాధపడింది. మధ్య వయస్సు వాడితో తనకు బలవంతపు పెళ్లి చేస్తున్నారని ఏడ్చింది.
పోలీసుల ఎంట్రీతో..
పెళ్లి కూతురు వెర్షన్ కరెక్టే అనిపించింది అక్కడి భక్తులకు. ఆలయ సిబ్బంది సైతం ఇలా బలవంతపు పెళ్లి చేయకూడదని పెళ్లిని అడ్డుకున్నారు. వివాహ తంతును ఆపించేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు, వధువులతో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచేశారు. పెళ్లి కూతురు కోరుకున్నట్టే.. ఆ పెళ్లి ఆగిపోయింది. వధువు హ్యాపీ. వరుడు అన్ హ్యాపీ.
Also Read : తండ్రి శవం ఎదుట ప్రియురాలితో పెళ్లి.. ఎక్కడంటే.. ఎందుకంటే..
పెళ్లి కాని ప్రసాదులెందరో..
42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాని ప్రసాదులు ఎందరో. ఎవరో ఒకరు అమ్మాయి దొరికితే చాలు అని తాళి కట్టేస్తున్న రోజులివి. లేడీస్‌కు అంత డిమాండ్ ఉంది మరి. అందుకే, అంత ఆస్తి ఉండాలి.. ఇంత జీతం రావాలి.. ఇలాంటి క్యారెక్టర్ కావాలి.. అంటూ అనేక డిమాండ్లు పెడుతున్నారు ఈతరం అమ్మాయిలు. కానీ, ఈ కేసులో అలా జరగలేదు. ఆమె తల్లిదండ్రుల బలవంతంతో 22 ఏళ్ల కూతురుకు 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. కానీ, ఆ అమ్మాయి మాత్రం సరైన సమయంలో ఏడ్చేసి.. ఆ ఏజ్ బార్ భర్త నుంచి బయటపడింది. పాపం ఆ పెళ్లికాని ప్రసాదు.. మరో అమ్మాయి కోసం మళ్లీ మొదటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఈ ఏజ్‌లో పెళ్లి కూతురు దొరకడం మనోడికి చాలా కష్టమే కానీ.. మరీ ఇలా 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న యువతిని పెళ్లి చేసుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు.