Jabardast Rakesh..ఒకప్పుడు జబర్దస్త్ (Jabardast) కామెడీ షోలో చిన్నపిల్లలతో స్కిట్స్ చేసి.. తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న రాకేష్ రాకింగ్ (Rocking Rakesh).. ఆ తర్వాత కాలంలో భారీ పాపులారిటీ అందుకున్నారు. ఈ మధ్యకాలంలో తనకంటూ ఒక సెపరేట్ టీం తో పదుల సంఖ్యలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన..ప్రముఖ న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత (Jordaar Sujatha) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. పండంటి బిడ్డకు జన్మనిస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ అపురూపమైన క్షణాలు తమ జీవితంలో ఒక అద్భుతం అంటూ..” జీవితంలో సగభాగమైన సుజాత ఒక బిడ్డకు తల్లిగా ఆనందించే ఈ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక స్త్రీ గౌరవిద్దాం..పూజిద్దాం ” అంటూ రాకేష్ పోస్ట్ చేయడంతో.. రాకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తొలిసారి కూతురు ముఖాన్ని పరిచయం చేసిన రాకేష్ – సుజాత దంపతులు..
ఇకపోతే వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకుని, తమ విషయాన్ని బహిరంగంగానే చెప్పి 2023 ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా దంపతుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు కానీ మళ్ళీ ఆ బిడ్డను అభిమానులకి చూపించలేదు. కానీ ఫాదర్స్ డే సందర్భంగా తొలిసారి కూతురు ముఖాన్ని రివీల్ చేసింది ఈ జంట. రాకేష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇందులో ఈ పాప ఎంత క్యూట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుజాత – రాకేష్ దంపతుల కుమార్తె ఇప్పుడు అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.ఇకపోతే ఈ దంపతులు తమ కూతురికి ‘ఖ్యాతిక’ అని నామకరణం కూడా చేశారు.
తొలిసారి బిడ్డతో అమ్మవారిని దర్శించుకున్న రాకేష్ జంట..
ఇదిలా ఉండగా కొన్ని గంటల క్రితం రాకేష్ తన భార్య జోర్దార్ సుజాత, కూతురుతో కలిసి నిమిషాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి అమ్మవారిని దర్శించుకున్న ఫోటోలను తాజాగా రాకేష్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలలో కూడా తమ పాపను అమ్మవారి ఆశీర్వాదం కోసం తీసుకొచ్చామని రాకేష్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రాకేష్ కెరియర్..
రాకింగ్ రాకేష్ కెరియర్ విషయానికి వస్తే.. జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు. అంతేకాదు ఇటీవల కెసిఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హీరోగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక తన భార్య సపోర్ట్ చేసిందని, నగలు అమ్మి సినిమా కోసం పెట్టుబడి పెట్టిందంటూ కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలోనే ఉంటూ అందరి మన్ననలు పొందుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న రాకింగ్ రాకేష్ ఇప్పుడు పరిపూర్ణమైన ఫ్యామిలీని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు.
also read: Samantha : నాగ చైతన్యను సమంత ఇంకా మర్చిపోలేదు.. ఇదిగో వీడియో ప్రూఫ్!