BigTV English

Anant Ambani Emotional Speech: కొడుకు స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. ప్రీ వెడ్డింగ్ లో ఎమోషనల్ మూమెంట్

Anant Ambani Emotional Speech: కొడుకు స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. ప్రీ వెడ్డింగ్ లో ఎమోషనల్ మూమెంట్

Anant AmbaniAnant Ambani, Radhika Merchant’s pre-wedding celebrations: దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త .. భారత కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో న భూతో న భవిష్యతి అన్న రీతిలో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్ కి విచ్చేశారు. ఈ వేడుకలో అంతర్జాతీయ పాప్ సింగర్ రిహానా తన ప్రదర్శనతో ఉర్రూతలూగించింది.


ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వేడుకలో  అనంత్ అంబాని ఉద్వేగంతో ప్రసంగించగా, కొడుకు మాటలకు ముఖేష్ అంబాని భావోద్వేగానికి గురయ్యారు. అనంత్ అంబానీ మాట్లాడుతూ ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి చెబుతుండగా ముకేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
అనంత్ అంబానీ మాట్లాడుతూ.. నా జీవితంలో నాకు ఇంత సంతోషాన్ని ఇవ్వడానికి నా కుటుంబం మొత్తం కష్టపడింది. ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నాకోసం చాలా కష్టపడింది. ఆమె రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను. అమ్మా మీరు చేసిన ప్రతిపనికి నా ధన్యవాధాలు.. ఈ ఈవెంట్ ను ప్రత్యేకంగా జరిపించేందుకు నా కుటుంబం అంతా కేవలం 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.
నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. నా జీవితంలో ఎంతో బాధను అనిభవించాను. నా చిన్నప్పటినుంచి చాలా అనారోగ్య సమస్యలతో బాధపడ్డాను ఆ బాధను మర్చిపోయేలా చేసి నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఎంతో శ్రమించారు. నా లక్ష్య సాధనలో అనుక్షణం ప్రోత్సహించారు. అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
కాగా వేడుకలకు విచ్చేసిన ప్రముఖులు, క్రీడాకారులు, అత్యంత సంపన్నులతో సహా 1000 మందికి పైగా హాజరయ్యారు. అతిథులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ.. ముకేష్ అంబానీ మాట్లాడారు. ఈ వేడుకకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబం అనుబంధం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా తన చిన్నకుమారుడు అనంత్ అంబానీని చూస్తుంటే తన తండ్రి ధీరుభాయ్ అంబానీని చూస్తున్నట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×