Viral Video: ఈ ఏడాది దేశంలో ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎప్పుడూ జూన్ మొదటి వారంలో వర్షాలు పడేవి. ఈసారి అగ్నికర్తెల సమయంలో భారీ వర్షాలు పడడం మొదలైంది. గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్, బెంగుళూరు, ముంబై నగరాల్లో వానలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షం వల్ల కొత్త ప్రారంభించిన వర్లీ అండర్ గ్రౌడ్ మెట్రోస్టేషన్ నీటిలో చిక్కుకుంది.
ఈసారి దేశంలోకి నైరుతి రుతుపవనాలు వేగంగా ప్రవేశించాయి. తొలుత జూన్ మొదటివారంలో కేరళను తాకవచ్చని అంచనా వేసినప్పటికీ వారం ముందుగానే దేశంలోకి ఎంటరైపోయాయి. రుతు పవనాలు ధాటికి వెస్ట్ కోస్తల్ అంతటా భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్టలో వానలు ముంచెత్తుతున్నాయి.
వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రీసెంట్‌గా ప్రారంభించిన వర్లీ భూగర్భ మెట్రో స్టేషన్ నీట మునిగిపోయింది. ముంబైలో భారీ వర్షానికి చెరువులా మారిపోయింది వర్లీ మెట్రో స్టేషన్. ఒకానొక దశలో ఆ నీరుని చూసి ట్రైన్ నుంచి దిగేందుకు భయటపడ్డారు ప్రయాణికులు.
మెట్రోలోకి ప్రవేశించడానికి వేచి ఉన్న స్టేషన్ గేట్ల వరకు కాకుండా ప్లాట్‌ఫామ్‌లపైకి కూడా నీరు చేరింది. ఏది ప్లాట్ ఫారం తెలియక మెట్రో ఆగినా దిగేందుకు ప్రయాణికులు ససేమిరా అన్నారు. దీంతో అలాగే వెళ్లిపోయింది. అదే సమయంలో మెట్రోలో ఉన్న ట్రావెలర్లు అందుకు సంబంధించిన వీడియో చిత్రీకరించారు.
ALSO READ: వరుడి తలపై కొబ్బరి బొండాన్ని పగలగొట్టాలా? ఇదెక్కడి సాంప్రదాయం?
మెట్రో రూప్ పైనుంచి వర్షం కంటిన్యూ అవుతూనే వుంది. ఆదివారం రాత్రి నుంచి మొదలు సోమవారం ఉదయం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీని కారణంగా ముంబై సిటీలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.
దైర్యం చేసుకుని ఆ స్టేషన్‌లో దిగిన కొందరు ప్రయాణీకులు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మెట్రో పైకప్ లీకేజీ స్పష్టంగా కనిపించింది. వరదలకు కారణం సరైన డ్రైనేజీ లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ముంబై మెట్రో లైన్-3 బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుండి వర్లిలోని ఆచార్య ఆత్రే చౌక్ వరకు మే 10న మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.
కొత్తగా ప్రారంభించబడిన స్టేషన్‌లోని నీరు ఈ విధంగా రావడంతో మౌలిక సదుపాయాల గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ఆ స్థాయిలో గత రాత్రి వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ-IMD తెలిపింది. రాబోయే వారం రోజులు పశ్చిమ తీరం వెంబడి కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల వల్ల ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో విమాన సేవలు, రైలు రాకపోకలపై ప్రభావం చూపాయి
Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE
— Tejas Joshi (@tej_as_f) May 26, 2025