Rajeev Kanakala: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజీవ్ కనకాల(Rajeev Kanakala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన ప్రముఖ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) భర్త అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే.. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాజీవ్ కనకాల తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమానికి హాజరయ్యారు. రాఖీ పండుగ (Rakhi Festival) సందర్భంగా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
రాఖీ పండుగ ప్రత్యేకం…
ఇక రాఖీ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన నేపథ్యంలో అన్న చెల్లెల సెంటిమెంటుతో కూడిన స్కిట్లు వేశారు. ఎప్పటిలాగే ఫోక్ సాంగ్స్ పాడుతూ ఆటపాటలతో అందరిని సందడి చేశారు అయితే ఈ ప్రోమో చివరిలో నూకరాజు వర్ష చేసిన స్కిట్ చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వర్ష పుట్టినప్పుడు తన తల్లి చనిపోవడంతో తన బాధ్యతలను తన అన్నయ్య తీసుకొని పెంచుతారు అయితే పెద్దయిన తర్వాత ఆమె క్యాన్సర్ తో మరణించినట్టు స్కిట్ చేశారు.
చెల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్…
ఇక ఈ స్కిట్ అక్కడే ఉన్నటువంటి రాజీవ్ కనకాలకు బాగా కనెక్ట్ కావడంతో ఆయన ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ స్కిట్ చూసిన అనంతరం రాజీవ్ మాట్లాడుతూ… ఫుల్లుగా భోజనం పెట్టి ఎందుకయ్యా ఇలా ఏడిపిస్తారు అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు అంతేకాకుండా ఇటీవల ఏ ఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారు స్వర్గం నుంచి వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వారికి సంబంధించిన వేడుకలలో పాల్గొంటున్నట్లు వీడియోలు చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ద్వారా రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీ లక్ష్మీ కనకాల(Sri Lakshmi Kanakala) స్వర్గం నుంచి వచ్చి తన అన్నయ్యకు రాఖీ కట్టినట్టు ఒక వీడియోని కూడా ప్లే చేశారు.
ఇలా తన అన్నయ్యకు రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య ..ఈ జన్మకు మన బంధం ఇక్కడి వరకు రాసి ఉందేమో అన్నయ్య.. అంటూ తన చెల్లెలు శ్రీలక్ష్మి ఈ వీడియోలో చెప్పిన మాటలకు రాజీవ్ కనకాలతో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక రాఖీ పండుగ చేద్దాం అనే ఈ కార్యక్రమం ఈ ఆదివారం ఈటీవీలో పూర్తి ఎపిసోడ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ ప్రోమో వీడియో చూసిన వారందరూ కూడా ఎమోషనల్ అవుతూ కామెంట్ చేస్తున్నారని చెప్పాలి. ఇక రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల కూడా క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే.. తన తల్లిదండ్రులను తన తోబుట్టును కోల్పోయిన రాజీవ్ కనకాల ఈ కార్యక్రమంలో వారందరిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
Also Read: Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ అందానికి సీక్రెట్ ఉమ్మి… ఎలా వాడాలో టిప్స్ కూడా చెప్పింది