మానవ సంబంధాలు రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నాయని చెప్పేందుకు తరచుగా కొన్ని ఘటనలకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు, నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా తల్లి, బిడ్డ ఇద్దరూ గర్భంతో ఉన్న వీడియోను ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో పెద్ద విశేషం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ, తల్లీ, బిడ్డను ప్రెగ్నెంట్ చేసింది ఒకే వ్యక్తి కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, ఆ వీడియోలో వాళ్లే చెప్పారు. ప్రస్తుతం తాము గర్భంతో ఉన్నామని, త్వరలోనే పిల్లలను కనబోతున్నట్లు చెప్పారు. అంతేకాదు, తమ కడుపులో పెరుగుతున్న బిడ్డలకు తండ్రి ఒకడే అని చెప్పడంతో అందరికీ మతిపోయింది. ఈ వైరల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ యూజర్ జాడే టీన్ (@xojadeteen) షేర్ చేసింది. ఇందులో జాడేతో పాటు ఆమె తల్లి డానీ స్వింగ్స్ తో గర్భవతిగా ఉన్నారు. “మా అమ్మ, నేను ఒకే వ్యక్తి ద్వారా ఒక వారం తేడాతో గర్భవతిగా ఉన్నాము. నా జీవితంలో ఇది అత్యంత సంతోషకరమైన సమయం. ఈ రోజు నేను 34 వారాల గర్భవతిని. నాకు ఒక నెల మాత్రమే మిగిలి ఉంది” అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పటి వరకు 75 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
ప్రస్తుతం జాడే తల్లి డానీ స్వింగ్స్ కు 44 ఏళ్లు. ఆమెకు జాడే జన్మించిన కొద్దికాలానికే భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత డానీ.. నికోలస్ యార్డి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేసి చివరికి ఒక్కటయ్యారు. డానీ తన కుమార్తె జాడేను కూడా వారితోపాటు అదే ఇంట్లో ఉంచుకున్నారు. ఆ సమయంలో జాడేకు 22 సంవత్సరాలు. ఇంచుమించు ఆమె తల్లి డేటింగ్ చేసిన నికోలస్ వయసు కూడా అంతే! నెమ్మదిగా నికోలస్ డానీతో పాటు ఆమె కూతురు జాడేకు కూడా దగ్గరయ్యాడు. బిడ్డతోనూ ప్రేమ కథ నడిపాడు. తల్లి, కూతురుతో పడక సంబంధాన్ని కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ గర్భం ధరించారు.
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆధునిక కాలపు సంబంధం”గా నెటిజన్లు అభివర్ణించారు. మెజారిటీ నెటిజన్లు దీనిని తప్పుబట్టారు. అదే సమయంలో కొంత మంది “సామాజిక విలువలకు ముప్పు” అంటూ మండిపడ్డారు. మరికొంత మంది ఈ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసిన స్టంట్ గా కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!