కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. ఇందుకోసం చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ ద్వారా ఆకట్టుకునే కంటెంట్ ను క్రియేట్ చేసి ఆదాయాన్ని పొందుతున్నారు. కొంత మంది ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తూ డబ్బులు సంపాదిస్తే, మరికొంత మంది ఫన్నీ వీడియోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొంత మంది అడల్ట్ కంటెంట్ అంటే.. అంద చందాలను ఎదుటి వారికి ఎరగా వేసి డబ్బును పొందుతున్నారు. అలాంటి కంటెంట్ ఎక్కువగా దొరికే యాప్ లలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ కూడా ఒకటి. కంటెంట్ క్రియేటర్స్ తమ ఫాలోవర్స్ కు నచ్చేలా కంటెంట్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో మెంబర్ షిప్ ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ప్లాట్ ఫారమ్ లో వివిధ రకాల కంటెంట్‌ను పోస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ను అందించే యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో వినియోగదారులు క్రియేటర్స్ కంటెంట్‌ను చూడటానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
సబ్ స్క్రిప్షన్ మోడల్: కంటెంట్ క్రియేటర్స్ తమ కంటెంట్ కు యాక్సెస్ ఇవ్వడానికి నెలవారీ లేదంటే వార్షిక సబ్ స్క్రిప్షన్ రుసుమును వసూలు చేస్తారు.
ప్రత్యేకమైన కంటెంట్: వినియోగదారులు తమ అభిమాన కంటెంట్ క్రియేటర్స్ నుంచి ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలు, ఇతర రకాల కంటెంట్‌ను పొందడానికి సబ్ స్క్రైబ్ కావాల్సి ఉంటుంది.
ఆదాయ సృష్టి: సృష్టికర్తలు కంటెంట్ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా నేరుగా ఆదాయం పొందుతారు, ఇది వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మార్గం.
‘ఓన్లీ ఫ్యాన్స్’ చట్టబద్దమేనా?: ‘ఓన్లీ ఫ్యాన్స్’ మన దేశంలో ఉపయోగించడం చట్టవిరుద్ధం కాదు. అయితే, క్రియేటర్స్ తమ కంటెంట్ లో అశ్లీలత, పిల్లల రక్షణకు సంబంధించిన భారతీయ చట్టాలను ఉల్లంఘించలేదని నిర్ధారించుకోవాలి. మైనర్లకు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్ ను షేర్ చేయడం నిషేధించబడింది. ప్లాట్ ఫామ్ చట్టబద్ధమైనప్పటికీ, వారి ఆదాయం ఇప్పటికీ భారతీయ పన్ను నియమాలకు లోబడి ఉంటుందని క్రియేటర్స్ తెలుసుకోవాలి.
క్రియేటర్స్ కు కలిగే లాభం: కంటెంట్ క్రియేటర్స్ తమ కంటెంట్ ను మార్కెట్ చేసుకుంటూ నేరుగా డబ్బు సంపాదించవచ్చు. ఈ కంటెంట్ వారి స్వంత నియంత్రణలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో కంటెంట్ షేర్ చేసే వాళ్లు ఆన్ లైన్ లో సంపాదించే ఇతర సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు, ఫ్రీలాన్సర్ల మాదిరిగానే ఉంటుంది. ఒక క్రియేటర్ ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తే, వారు కూడా పన్ను ఆడిట్‌కు లోబడి ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ చట్టబద్ధమైనది. కానీ, క్రియేటర్స్ పన్ను నియమాలను పాటించాలి. ఆదాయపు పన్ను, GST నియమాలకు అనుగుణంగా ఉండేలా ఆదాయం, ఖర్చులరికార్డులను మెయింటెయిన్ చేయాలి.
తక్కువ వయస్సు గల వారికి ప్రమాదం: ఈ ప్లాట్ ఫారమ్ తక్కువ వయస్సు ఉన్న వారు ఉపయోగిస్తున్నారు. వారు డబ్బు సంపాదించడానికి అసభ్యకరమైన కంటెంట్‌ను అప్ లోడ్ చేసే ప్రమాదం ఉంది.
గోప్యతా సమస్యలు: వినియోగదారులు తమ గుర్తింపును గోప్యంగా ఉంచుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి వాస్తవ గుర్తింపు బయటపడే అవకాశం ఉంది.
Read Also: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!