BigTV English

Single Lemon Price is ₹ 35,000: ఒక్క నిమ్మకాయ ధర రూ. 35వేలు.. ఇది కొంటేకోటీశ్వరులు అవ్వటం ఖాయం..?

Single Lemon Price is ₹ 35,000: ఒక్క నిమ్మకాయ ధర రూ. 35వేలు.. ఇది కొంటేకోటీశ్వరులు అవ్వటం ఖాయం..?

Lemon price


A Single Lemon is Just Rs.35,000 Only: నిమ్మకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తరచూ ఏదోక రూపంలో తీసుకుంటాం. ఇక వేసవిలో అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిమ్మకాయ సోడా నుంచి షరబత్ వరకు చేసుకుంటాం. కాబట్టి వేసవిలో నిమ్మకాయ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. రూ.5నుంచి రూ.10 మధ్యలో ఉండొచ్చు.కానీ చెన్నైలో వింత ఘటన జరిగింది.

ఒక్క నిమ్మకాయ ధర ఏకంగా రూ.35 వేలు పలికింది. ఇంత ధర పలికిందంటే దానికి ఏమైన ప్రత్యేకతలు ఉన్నాయని అనుకుంటున్నారా? అలాంటిది ఏమి లేదు. మామూలు నిమ్మకాయే. వేసవిలో నిమ్మకాయ ధరలు పెరుగుతాయని తెలుసు. కానీ, ఇలా వేల రూపాయలు ధర పెరగడం సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూడండి.


నిజానికి ఒక్క నిమ్మకాయ ధర అంత ఉండదు. వేసవి కాబట్టి ఐదో లేదా పదో ఉంటుంది. ఎక్కడా కూడా నిమ్మకాయ ధరలు వేలల్లో ఉండవు. అయితే ఇక్కడ నియమ్మకాయను వేలం వేస్తే రూ.35 వేలు పలికింది. చెన్నైలోని ఈరోడ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Read More: ఓరి మీ దుంపల్‌తెగ.. పరీక్షల్లో ఆన్సర్లు రాయమంటే ఏం రాశారో చూడండి.. నవ్వాగదు

ఈ రోడ్‌కు 35 కిలోమీటర్లు దూరంలోని శివరగి గ్రామ సమీపంలో పాతపూసయ్య ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజల్లో రకరకాల పండ్లతో పాటు నిమ్మకాయలు కూడా ఉపయోగించారు. అలా పూజ చేసిన వస్తువులను ఆలయ అధికారులు వేలం వేయడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ నేపధ్యంలో పూజలో వినియోగించిన నిమ్మకాయు వేలం వేయగా.. దాన్ని దక్కించుకోడానికి భక్తులు పోటీపడ్డారు. చివరకు ఓ భక్తులు రూ.35 వేలకు దక్కించుకున్నాడు. అయితే వేలంలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారు. అన్ని వస్తువుల కంటే వేలంలో నిమ్మకాయను అధిక ధరకు ఓ భక్తుడు దక్కించుకున్నాడని ఆయల అధికారులు తెలిపారు. వేలంలో నిమ్మకాయ దక్కించుకున్న భక్తుడికి శివుడి ముందు పూజలు నిర్వహించి నిమ్మకాయను పూజారి అందజేశాడు.

Read More: జీన్స్ ఎక్కువగా బ్లూ కలర్‌లో ఎందుకు ఉంటాయి?

ఈ ఆలయంలో శివ రాత్రి సందర్భంగా పూజలు చేసే నిమ్మకాయను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఈ నిమ్మకాయ దక్కించుకున్నవారు. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని.. ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. ఇలా ఒక్క నిమ్మకాయ వేలలో పలకడం ఇదే మొదటి సారి. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వేలంలో నిమ్మకాయను దక్కించుకున్న భక్తుడిది ఇండోర్. ఆయన రూ.35 వేలకు నిమ్మకాయను దక్కించుకున్నాడు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×