BigTV English

Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

Abhishek vs Digvesh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ, లక్నో బౌలర్ దిగ్వేశ్ రతి సింగ్ మధ్య తీవ్రమైన గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత లక్నో బౌలర్ దిగ్వేశ్ ఓవర్ యాక్టింగ్ చేశాడు. గ్రౌండ్ నుంచి వెళ్ళిపో అంటూ అభిషేక్ శర్మను ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అభిషేక్ శర్మకు కూడా కోపం వచ్చింది. దిగ్వేశ్ పైకి రెచ్చిపోయి.. వార్నింగ్ ఇవ్వబోయాడు. ఈ నేపథ్యంలోనే లక్నో ప్లేయర్లు అందరూ ఇద్దరినీ ఆపారు. దీంతో ఆ వివాదం అక్కడితో చల్లబడింది.


 Also Read : RCB IPL Playoffs : బెంగళూరుకు కొత్త టెన్షన్.. 18వ తేదీ విలన్ గా మారనుందా..?

గొడవ ఆపిన బిసిసిఐ అధికారి రాజీవ్ శుక్లా


లక్నో ఆటగాడు దిగ్వేష్ సింగ్ , సన్రైజర్స్ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య గొడవను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల ఆపినట్లు తెలుస్తోంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత.. ఇద్దరు యంగ్ కుర్రాళ్ళతో.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల మాట్లాడారు. అంతకుముందు ఈశాన్ కిషన్ ఇద్దరితో మాట్లాడి.. పంచాయతీ తెంపే ప్రయత్నం చేశాడు. కానీ తెగలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఇద్దరితో గ్రౌండ్ లోనే మాట్లాడి… వారిద్దరి మధ్య ఉన్న పంచాయతీని తెంపాడు. రాజీవ్ శుక్ల రంగంలోకి ఎంటర్ కావడంతో… అప్పటివరకు బద్ధ శత్రువులుగా ఉన్న అభిషేక్ శర్మ అలాగే దిగ్వేష్ సింగ్ ఇద్దరు కూల్ అయిపోయారు. అనంతరం ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న వీడియోలు అలాగే ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

రాజీవ్ శుక్లాపై ట్రోలింగ్

అభిషేక్ శర్మ అలాగే దిగ్వేష్ సింగ్ ఇద్దరి మధ్య పంచాయతీ తెంపిన రాజీవ్ శుక్లపై.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో… బ్రహ్మానందం పంచాయతీ తెంపినట్లుగానే… ఈ ఇద్దరి మధ్య రాజీవ్ శుక్ల పంచాయతీ తెంపాడని.. సెటైర్లు పేల్చుతున్నారు. నీకు 10 ఎకరాలు… నాకు 10 ఎకరాలు అన్నట్లు బ్రహ్మానందం డైలాగులు వాడుకుంటున్నారు. మొత్తానికి ఇద్దరు మధ్య సన్నాఫ్ సత్యమూర్తి లో బ్రహ్మానందం లాగా.. దూరి గోడవని ఆపాడని కొంతమంది పొగుడుతున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారిగా తనవంతు పాత్ర పోషించాడని రాజీవ్ శుక్లా ను ఆకాశానికి ఎత్తుతున్నారు కొంతమంది. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో అద్భుతంగా అభిషేక్ శర్మ ఆడిన సంగతి తెలిసిందే. ఏకంగా 59 పరుగులు చేసి హైదరాబాద్ జట్టును గెలిపించాడు. దీంతో హైదరాబాద్ చేతిలో లక్నో ఓడిపోయి ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. అటు హైదరాబాద్ జట్టు ఇప్పటికే.. ఐపీఎల్ నుంచి వైదొలిగిన సంగతి మనందరికీ తెలిసిందే.

Also Read: Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?

?igsh=em8wNG1ub2lmd25q

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×