Pahalgam Terror Attack Place: పహల్గామ్ ఉగ్రదాడితో.. కశ్మీర్ కళ తప్పింది. పర్యాటకుల గుండెల్ని చీల్చిన ఉగ్రవాదుల తూటాలు.. వారి ప్రాణాలను హరించడమే కాదు.. కశ్మీర్ పర్యాటకాన్ని కూడా కోలుకోలేని దెబ్బతీశాయ్. టెర్రర్ ఎటాక్ తర్వాత పహల్గామ్‌లోనే కాదు.. మొత్తం కశ్మీర్ ఖాళీగా కనిపిస్తోంది. టూరిస్టులు లేక వెలవెలబోతోంది. ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ ఎలా మారిపోయింది? కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులేంటి?
ఒక్క ఉగ్రదాడితో.. దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. పహల్గామ్‌లో పోయిన ప్రాణాలు చూసి.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం తర్వాత.. కశ్మీర్ మళ్లీ కల్లోలిత ప్రాంతంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే కశ్మీర్ సెటిలవుతుందనుకుంటున్న టైమ్‌లో.. ఒక్క టెర్రర్ అటాక్‌తో.. అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఈ దుర్ఘటన.. అక్కడి పర్యాటక రంగం, జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ, సామాజిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ఒక్కటే కాదు.. కశ్మీర్‌లోని మిగతా పర్యాటక ప్రాంతాలు కూడా ఇప్పుడు వెలవెలబోతున్నాయ్. కశ్మీర్ అందాలను తనివితీరా చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన టూరిస్టులంతా.. తమ టూర్లని మధ్యలోనే క్యాన్సిల్ చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు.
ఉగ్రదాడి రోజు అసలేం జరిగింది. ఉగ్రవాదులు బైసరన్ కు ఎలా చేరుకున్నారు.. బిగ్ టీవి కళ్లకు కట్టినట్టు చూపించింది.. లెట్స్ వాచ్