BigTV English
Advertisement

RakshaBandhan Siblings Fight: రాఖీ పండుగ రోజు ‘ఆల్ మెన్ ఆర్ రేపిస్ట్’ ట్వీట్ చేసిన యువతి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?..

RakshaBandhan Siblings Fight: రాఖీ పండుగ రోజు ‘ఆల్ మెన్ ఆర్ రేపిస్ట్’ ట్వీట్ చేసిన యువతి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?..

RakshaBandhan Siblings Fight| ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునే పండుగలలో రక్షాబంధన్ ఒకటి. ఈ పండుగ రోజు ప్రతి సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పవిత్ర బంధానికి ప్రతీక ఈ పండుగ. ఒకరికి కష్టం వస్తే మరొకరు వారిని రక్షిస్తామని ప్రమాణం చేసి సోదర బంధాన్ని బలపరిచే ఈ పండుగ రోజు అనుకోకుండా అన్నా చెల్లెళ్లు గొడవపడ్డారు. అయితే ఈ గొడవ సోషల్ మీడియాలో సాగింది. ఈ గొడవలో పురుషలంతా సోదరుడివైపు, మహిళలంతా ఆ యువతి వైపు ఉండిపోవడంతో పెద్ద విభజన జరిగి మాటల యుద్ధమే జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అందరు సోదరుల లాగే ఒక యువకుడు తన చెల్లెలి కోసం రాఖీ పండుగ సందర్బంగా బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ అతని సోదరి దేశంలో జరిగిన ఒక అనూహ్య ఘటన గురించి ఆలోచిస్తూ.. పురుషులకు వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వల్ల ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో ఆ యువకుడు కోపంతో తన సోదరి కోసం ఆర్డర్ చేసిన గిఫ్ట్ ని క్యాన్సిల్ చేశాడు. ఈ కారణంగా వారి ఇంట్లో పండుగ వాతావరణం కాస్తా చెడిపోయింది.

దేశంలో ఇటీవల ఓ మహిళా డాక్టర్ పై ఒక ఉన్మాది అత్యాచారం చేసి.. ఆ తరువాత ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో దేశమంతా నిరసనలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఈ పైశాచిక ఘటనకు వ్యతిరేకంగా చాలామంది సెలెబ్రిటీలు సైతం గళం విప్పారు.


కొందరు ప్రముఖ మహిళలపై ఇంత హృదయ విదారక ఘటన తరువాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎలా చెప్పాలి? అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ ఘటనకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. దేశమంతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్లపై నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి కోల్ కతా హత్యాచారం ఘటనపై మనస్తాపం చెంది.. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ లో ‘ఆల్ మెన్ ఆర్ రేపిస్ట్’ (పురుషలందరూ అత్యాచారం చేసేవారే) అనే కాప్షన్ తో ఓ పోస్ట్ చేసింది. అయిదే ఆమె పోస్ట్ చేసిన రోజు రాఖీ పండుగ. ఆమె పోస్ట్ ని కొంతమంది సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఆ విమర్శలు చేసిన వారిలో ఒకరు ఆ యువతి సోదరుడి స్నేహితుడు.

రాఖీ పండుగ కావడంతో ఆమె సోదరుడు ఆ యువతి కోసం ఆన్ లైన్ లో ఒక గిఫ్ట్ ఆర్డర్ చేశాడు. సంతోషంగా తన చెల్లి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవాలని ఎదురు చూస్తూ ఉండగా.. అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది. అతని స్నేహితుడే. ఫోన్ చేసిన స్నేహితుడు అతనికి తన చెల్లి పెట్టిన పోస్ట్ గురించి చెప్పాడు. దీంతో ఆ సోదరుడు తన చెల్లి పెట్టిన పోస్ట్ ని ఇన్స్‌టాగ్రామ్ లో చూశాడు. ఆ పోస్ట్ అతనికి నచ్చలేదు. ఆ సోదరుడు కూడా వెంటనే తన చెల్లి పోస్ట్ పై వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. ఆ తరువాత తన చెల్లి చేత రాఖీ కూడా కట్టించుకోలేదు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

ఈ ఘటన పై కొందరు ఆ యువతి పోస్ట్ ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తుంటే.. మరొకొందరు వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక యూజర్ ఆమెను వ్యతిరేకిస్తూ.. పురుషలందరూ అత్యాచారం చేసే వారైతే.. ఆమె అన్న కూడా రేపిస్ట్ కదా.. మరి అలాంటి వ్యక్తికి ఆమె రాఖీ ఎలా కడుతుంది అని రాశాడు. మరొకరైతే.. మొత్తానికి వారి ఇంట్లో రాఖీ పండుగ జరగలేదన్న మాట అని కామెంట్ రాశాడు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×