E-Paper
Advertisement

Ramadan Dates: రంజాన్ ఉపవాసానికి ఆ ఖర్జూరమే ఎందుకు? అసలు సీక్రెట్ ఇదే!

Ramadan Dates: రంజాన్ ఉపవాసానికి ఆ ఖర్జూరమే ఎందుకు? అసలు సీక్రెట్ ఇదే!
Advertisement

Ramadan Dates: రంజాన్ మాసం మొదలైపోవడంతో ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, గసగసాల అమ్మకం, కొనుగోళ్లతో బేగంబజార్ గల్లీలన్నీ కోలాహాలంగా మారాయి.. ఇంతకీ ఖర్జూరంలో ఎన్నేసి రకాలుంటాయి? వాటి వాటి ధరలు ఎలాంటివి? వాటిలో ఎక్కువ సేల్ అవుతున్నవేంటి?

విదేశీ ఖర్జూరాల రకాలు

Advertisement

ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖర్జూరాలన్నీ విదేశాల నుంచి వచ్చినవే.. వీటిలో కిమియా, మజఫతి, మెడ్జూల్, సుక్రి, మష్రుక్, అంబర్, రబి, అజువా, మరియం, తునేషియన్ వంటి 50కి పైగా ఖర్జూరాలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.. ఇవన్నీ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, టర్కీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని చెబుతున్నారు వ్యాపారులు.

ఉపవాసానికి ఖర్జూరం

Advertisement

రంజాన్ మాసం.. ముస్లింలకు ఎంతో పవిత్రమైంది.. ఈ నెలంతా కఠినమైన నియమ నిష్టలతో అల్లాహ్ ని ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు ముస్లింలు.. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్ష చేస్తారు.. ఇక సాయంకాలం ఉపవాసం విడిచే సమయంలో ముందుగా ఖర్జూరా తినడం అనాదిగా వస్తోన్న ఆచారం. రోజంతా ఉపవాసం ఉన్నవారు తక్షణ శక్తి కోసం ఖర్జూరం తింటారు. రంజాన్ రాకతో ప్రస్తుతం ఖర్జూరాలు అమ్మే షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.. రకరకాల వెరైటీల ఖర్జూరాలు కస్టమర్ల నోరూరిస్తున్నాయి.

బేగంబజార్‌లో ఖర్జూరాల రేంజ్

ఖర్జూరా టేస్ట్, క్వాలిటీని బట్టి ధర ఉందని అంటారు వ్యాపారులు. బేగంబజార్ లో ఖర్జూరాలు.. అత్యంత చౌకగా దొరుకుతున్నాయి. ఈ ధరలు వంద నుంచి మొదలవుతున్నాయి. ధర, రుచీ రెండూ బాగుండటంతో.. ఈసారి కస్టమర్ల నుంచి రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు వ్యాపారులు. అలాగే ఇక్కడ హైక్వాలిటీ ప్రీమియం రేంజ్ ఎంతుందో చూస్తే.. రూ.1200 వరకూ ధర పలుకుతోంది. అంటే కిలో రూ.100 నుంచి రూ.1200 వరకు ఖరీదు చేసే రకరకాల ఖర్జూరాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుంచి ఈ ఏడాది ఎక్కువగా దిగుమతి చేసుకున్నామని.. ఎందుకంటే కస్టమర్లు విదేశీ రకాలనే ఎక్కువగా కోరుతున్నట్టు చెబుతున్నారు వ్యాపారులు.

ఖర్జూరాల డిమాండ్‌

రంజాన్ మాసం మొదలవడంతో మార్కెట్లకి ఖర్జూరాలు అధిక మొత్తంలో దిగుమతి అవుతున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 30వేల టన్నులకు పైగా ఖర్జూరాలు ఇంపోర్ట్ అయ్యాయి. బేగంబజార్ లో రోజుకు 30 నుంచి 40 టన్నుల ఖర్జూరాలు అమ్మకం, కొనుగోళ్లు జరుగుతుంటాయని చెబుతున్నారు వ్యాపారులు.. అలాగే డ్రై ఫ్రూట్స్ డిమాండ్ కూడా భారీగానే ఉందంటారు వీరు.

Also Read:  ఎవరీ ఎల్ మంచో? అతను చస్తే ఇంత విధ్వంసమా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×