BIG TV LIVE Originals: సమోసా గురించి భారతీయులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రతి చాయ్ దుకాణం దగ్గర కచ్చితంగా సమోసాలు దొరుకుతాయి. కొన్ని చోట్ల చిన్న సమోసాలు అందుబాటులో ఉంటే, మరికొన్ని చోట్ల పెద్ద సమోసాలు దొరుకుతాయి. చిన్న సమోసా ధర ఒక్కో దానికి సుమారు 5 రూపాయలు ఉంటుంది. ఈ సమోసాల లోపల ఎక్కువగా ఉల్లిపాయ, క్యారెట్ వాడుతారు. అదే పెద్ద సమోసా ధర రూ. 20 వరకు ఉంటుంది. రెండు పెద్ద సమోసాలు తింటే ఆకలి అనేదే ఉండదు. కొంత మంది మధ్యాహ్నం లంచ్ కి బదులుగా రెండు సమోసాలు తినే వాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇండియాలో సమోసా ధర రూ. 20.. మరి విదేశాల్లో?
మైదా పిండి, ఆలూ పూర్ణంతో కలిసి రుచికరమైన సమోసాలను తయారు చేస్తారు. చక్కగా మైదాతో రోటీ తయారు చేసి, అందులో ఓ గరిటెడు ఆలు మసాలా, ఉడికించిన పచ్చి బఠాణీలు పెట్టి త్రిభుజాకారంలో ప్యాక్ చేస్తారు. దాన్ని నూనెలో కాల్చి బయటకు తీస్తారు. ఆ సమోసాకు మసాలా మిర్చీ యాడ్ చేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది. ఇక టమాట సాస్ లో అద్దుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సమోసాకు ఇండియాలో ధర సుమారుగా రూ. 20 ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్ లో, మాల్స్ లో రూ. 30 నుంచి 40 వరకు పలుకుతాయి. ఇవే సమోసాలు విదేశాల్లో ఎంత ధర పలుకుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆయా దేశాల్లో సమోసాల ధరల వివరాలు:
ఇంగ్లండ్ – రూ. 220
ఆస్ట్రేలియా – రూ. 160
సింగపూర్ – రూ. 180
జర్మనీ – రూ. 210
జపాన్ – రూ. 250 +
సౌత్ ఆఫ్రికా – రూ. 80
యుఏఈ – రూ. 90
కెనడా – రూ. 200
Read Also: నడుము అందాలు చూపిస్తు.. కెరీర్ పై దృష్టి పెట్టిన అలేఖ్య సిస్టర్ రమ్య!
అమెరికా – రూ. 180 నుంచి 250 వరకు ఉంటుంది.
ఆయా దేశాల్లోని భారతీయ రెస్టారెంట్లు, బేకరీలలో సమోసాలు లభిస్తాయి. ఇండియన్స్ తో పాటు విదేశీయులు కూడా సమోసాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్నాక్స్ కు మంచి గుర్తింపు ఉంది. కానీ, ఇండియాతో పోల్చితే విదేశాల్లో ఎక్కువ ధర ఉంది. అత్యాధికంగా జపాన్ లో ఒక్కో సమోసాకు రూ. 250కి పైగా ధర పలుకుతోంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: అమెరికాలో ఇన్ని అరాచకాలా? మీరు అస్సలు ఊహించలేని దారుణాలు.. జాబితే పెద్దదే!