మనిషి జీవితంలో లైంగిక ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడడానికి కూడా లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉండాలి. అయితే కొత్తగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి వేళ్ల పొడవును బట్టి అతడిలోని లైంగిక కోరికలు, లైంగిక ప్రవర్తన, ప్రాధాన్యతలు అంచనా వేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త పరిశోధన మగవారిలో సెక్స్ డ్రైవ్ గురించి కొత్త విషయాలను తెలియజేస్తోంది.
శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం మగ బిడ్డ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే అతని వేళ్లను బట్టి భవిష్యత్తులో లైంగికంగా ఎలా ప్రవర్తిస్తారో శాస్త్రవేత్తలు అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ఆండ్రోజెన్లు అని పిలిచే మగ హార్మోన్లు మెదడు స్పందనకు కారణమవుతాయి. ఇవే తర్వాతి కాలంలో లైంగిక ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అయితే ఆ ప్రభావం నేరుగా కలవడం కష్టమే. కానీ అధ్యయనం ద్వారా దాన్ని ఒక అంచనా వేయవచ్చు.
చూపుడు వేలు చిన్నగా ఉంటే…
ఇందుకోసం శాస్త్రవేత్తలు ఎలుకలపై అధ్యయనాన్ని నిర్వహించారు. జపాన్లోని ఒకహామా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎలుకలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని లోతుగా తెలుసుకున్నారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక మగ వ్యక్తి చూపుడు వేలు, ఉంగరపు వేలు మధ్య నిష్పత్తిని బట్టి అతడి లైంగిక ప్రక్రియను అంచనా వేయవచ్చు. దీన్ని 2d:4d నిష్పత్తి అని పిలుస్తారు. పురుషుల చూపుడువేలు వారి ఉంగరపు వేళ్ళతో పోలిస్తే పొడవు తక్కువగా ఉంటాయి. అయితే ఇలా చిన్న చూపుడు వేలిని కలిగిన వారు బలమైన సెక్స్ డ్రైవ్ ను కలిగి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకల్లో కూడా చూపుడు వేలు పరిమాణం తక్కువగా ఉన్న ఎలుకలు లైంగికంగా చురుకుగా ఉన్నాయని, ఆడ ఎలుకల సువాసనను ఎక్కువగా ఇష్టపడుతున్నాయని తేలింది.
పరిశోధనలో భాగంగా మగ ఎలుకలను, ఆడ ఎలుకలతో జత కట్టడానికి అనుమతించారు. పొడవైన చూపుడువేలు ఉన్నవాటికంటే… చిన్న చూపుడు వేలు కలిగిన మగ ఎలుకలు సంభోగ సమయంలో త్వరగా స్కలనం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు బలమైన సెక్స్ డ్రైవ్ ను, మెరుగైన అంగస్తంభనా పనితీరును కూడా చూపించాయి.
అలాగే ఈ ఎలుకలపై చేసిన పరిశోధనలో భాగంగా బోనులో రెండు పరుపులను ఉంచారు. ఒక పరుపుకు మగ ఎలుకల వాసన వచ్చేలా, రెండో పరుపుకు ఎలుకల వాసన వచ్చేలా చేశారు. అయితే ఆ రెండు పరుపుల దగ్గరికి మగ ఎలుకలను వదిలారు. చూపుడువేలు చిన్నగా ఉన్న ఎలుకలు త్వరగా ఆడ ఎలుకల వాసనను పసిగట్టేసి ఆ పరుపు దగ్గరకు మారాయి. అక్కడే వాసన చూస్తూ వాటి కోసం వెతుకుతూ ఉండిపోయాయి.
లైంగిక ప్రవర్తన అనేది గర్భంలోనే శిశువుగా ఉన్నప్పుడే ఏర్పడడం ప్రారంభమవుతుందని ఈ అధ్యయనం చూపిస్తోంది. గర్భాశయంలోని హార్మోన్లు… మెదడు అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చేతివేళ్ల పొడవును బట్టి ఒకరి ప్రవర్తన అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది అని ఈ అధ్యయనకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ అధ్యయనం మగ ఎలుకలపై మాత్రమే సాగింది. మనుషులపై ఇంకా జరగలేదు. అయితే ఎలుకలపై జరిగిన అధ్యయనాలు ఎన్నో మనిషికి కూడా వర్తిస్తూనే ఉన్నాయి. కాబట్టి మనుషులు కూడా దాదాపు ఇలానే ప్రవర్తించే అవకాశం ఉంది.