Swiggy genie steals laptop| ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ తన ల్యాప్ టాప్ దొంగతనం చేసి.. తిరిగి ఇవ్వాలంటే రూ.15 వేలు డిమాండ్ చేశాడని ఒక కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దొంగతనం ఎలా జరిగిందో విని నెటిజెన్లు షాక్ అవుతున్నారు. అసలు స్విగ్గీ జీనీ డెలివరీ ఎవరు బుక్ చేసుకోమన్నారు. అది కూడా ఖరీదైన వస్తువుల డెలివరీకి ముక్కు ముఖం తెలియని వారిని ఎలా నమ్ముతారు? అని కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నిషిత గుడిపూరి అనే సివిల్ ఇంజినీర్ లింకిడ్ ఇన్ లో ఓ పోస్ట చేసింది. ఆ పోస్ట్ ప్రకారం.. నిషిత భర్త ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తన కంపెనీ ఆఫీసుకి నుంచి ఒక ల్యాప్ టాప్ తీసుకొని మాదాపూర్ లోని తన ఇంటి వరకు చేర్చడానికి స్విగ్గీ జీనీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ ని ఉపయోగించాడు. అయితే స్విగ్గీ తరపున వచ్చిన ఆ డెలివరీ ఏజెంట్ ఆఫీసు నుంచి లాప్ టాప్ తీసుకొని బయలుదేరిన సమయంలో బ్యాగులో ఏముందో చూసుకొని తన ఫోన్ స్విచాఫ్ చేశాడు.
మరోవైపు లాప్ టాప్ కోసం ఎంతసేపు ఎదురుచూసినా రాకపోయే సరికి నిషిత భర్త ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ కు ఫోన్ చేశాడు. అయితే అతని ఫోన్ స్విచాఫ్ అని తెలిసింది. కొన్ని గంటలపాటు ఎదురు చూసిన తరువాత ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో నిషిత భర్త ఓపిక నశించి.. స్విగ్గీ కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు.
అప్పుడు స్విగ్గీ కస్టమర్ కేర్ ఉద్యోగి కూడా ఆ డెలివరీ బాయ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆ డెలివరీ ఏజెంట్ వివరాలు ధృవీకరించడానికి కస్టమర్ కు పంపాడు. అతని ఫొటో కూడా పంపించాడు. అది చూసి నిషిత భర్త కు మరో షాక్ తగిలింది. స్విగ్గీ కస్టమర్ కేర్ పంపిన ఫోటోలో మరో వ్యక్తి ఉన్నాడు. లాప్ టాప్ తీసుకెళ్లింది మరో వ్యక్తి.
ఈ విషయం మరింత గందరగోళానికి దారి తీసింది. దీంతో కస్టమర్ కేర్ వారు డెలివరీ ఏజెంట్ ప్రొఫైల్ ఫొటోతో పాటు.. అతని లాగిన్ ఫొటో కూడా పంపాడు. అప్పుడు తెలిసింది అసలు కథ. అసలు స్విగ్గీ ఏజెంట్ వేరు లాప్ టాప్ తీసుకెళ్లిన వ్యక్తి వేరు. వారి ద్దరి ఫొటోలు చూసి రెండో వ్యక్తి తన లాప్ టాప్ తీసుకెళ్లాడని నిషిత భర్త కస్టమర్ కేర్ కు తెలిపాడు.
అయితే సాయంత్రం స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఫోన్ ఆన్ అయింది. అతను కస్టమర్ కు కాల్ చేసి.. తన స్నేహితుడు తన స్విగ్గీ అకౌంట్ ను లాగిన్ చేసి పనిచేస్తున్నాడని.. కస్టమర్ ల్యాప్ టాప్ త్వరలోనే అందుతుందని చెప్పాడు. కాసేపు తరువాత ఆ డెలివరీ ఏజెంట్ వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపాడు. లాప్ ట్యాప్ కావాలంటే రూ.15 వేలు చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేశాడు. రూ.15 వేలు చెల్లిస్తే.. రాపిడో ద్వారా లాప్ టాప్ పంపిస్తానని చెప్పాడు.
ఈ వాట్సాప్ చాట్ అంతా నిషిత భర్త స్క్రీన్ షాట్ తీసి స్విగ్గీ కస్టమర్ కేర్ కు పంపాడు.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?
నిషిత చేసిన పోస్ట్ లో వివరాలు ఇంతవరకే ఉన్నాయి. ఆ తరువాత ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ”స్విగ్గీ లాంటి పెద్ద బ్రాండ్ ని నమ్ముకుంటే.. ఇలాంటి దొంగలను మా ఇంటి వరకు వస్తున్నారు” అని విమర్శించింది.
నిషిత చేసిన పోస్ట్ పై చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. ”లాప్ టాప్ లాంటి ఖరీదైన వస్తువుని అది కూడా ఆఫీసు ఉపయోగం కోసం వినియోగించేదాన్ని ఇలా ఎవరో మూడో వ్యక్తి ద్వారా ఎలా డెలివరీ చేసుకుంటారు. ఆలోచించాలి కదా?..” అని రాశాడు. మరో వ్యక్తి అయితే ”హైదరాబాద్ పోలీసులు చాలా త్వరగా దొంగలను పట్టుకుంటారని విన్నాను. వారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు” అని కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్ అయితే తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని.. ఇకపై స్విగ్గీ జీనీ డెలివరీ ఉపయోగించడం మానేశానని చెప్పారు.
Also Read: ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..