Bigg Boss 8 Promo: బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ప్రోమో విడుదలైంది. గత కొన్ని సీజన్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని వ్యవహరిస్తున్న యాక్టర్ నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారీ బిగ్ బాస్ లో అంతా లిమిట్ లెస్.. ఒక్కసారి కమిటైతే లిమిటే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో సోలో ఎంట్రీ లేందంటూ.. కంటెస్టెంట్స్ ను జోడీగా హౌస్ లోకి పంపించారు.
బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ప్రోమో విడుదలైంది. గత కొన్ని సీజన్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని వ్యవహరిస్తున్న యాక్టర్ నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారీ బిగ్ బాస్ లోఅంతా లిమిట్ లెస్.. ఒక్కసారి కమిటైతే లిమిటే లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సారి బిగ్ బాస్ సీజన్‌లో సోలో ఎంట్రీ లేందంటూ.. కంటెస్టెంట్స్ ను జోడీగా హౌస్ లోకి పంపించారు. ఈ షో ఈ ఆరంభ వేడుకకు పలువురు సినీ తారలు సందడి చేశారు. “సరిపోదా సనివారం” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని, హీరోయిన్ ప్రియాంక పాల్గొన్నారు. హీరోగా నానీకి ఎన్ని మార్కులు ఇస్తావ్ అని నాగార్జున ప్రియాంక మోహనన్ ని అడగ్గా.. వందకి వంద ఇస్తాను అని చెప్పింది. మరి సూర్యాని ఎలా బాలెన్స్ చేస్తావు అని నానీ, నాగార్జున హీరోయిన్ ని అడిగి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆమె తెలివిగా “101” ఇస్తానింటూ సమాధానమిచ్చింది. ఇక నాగార్జున నాలుగు వారాలు హాలిడే కోసం వెళతానని బిగ్ బాస్ హోస్ట్ చేస్తావా అని నానిని అడగగ అదొక్కటి తప్ప ఏమడిగినా చేస్తానని చెప్పారు నాని..
“35 చిన్న కథ కాదు” మూవీ ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో వాళ్లద్దిరిని ఒక వారం ఉండమని నాగార్జున కోరగా.. తాను మూడు రోజులు, రానాను ఐదురోజులు ఉంచమని సలహా ఇచ్చింది నివేదా థామస్.. తనను మాత్రం మూడు రోజుల్లో ఎలిమినేట్ చేయమని కోరింది.
ఆ తర్వాత నాని, ప్రియాంకమోహనన్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అక్కడ కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ.. మీరంతా ఇలా నవ్వుతూ, ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే నాకు మీ ఫ్యూచర్ కనబడుతుంది అని అనడంతో అందరూ నవ్వేశారు.
డైరక్టర్ అనీల్ రావిపూడి కూడా బిగ్ బాస్ షోలో సందడి చేశారు. కంటెస్టెంట్స్ ఎవరు? ఎంత మంది వస్తున్నారు? వివరాలు తెలియాల్సి ఉంది.